ప్రస్తుత రోజుల్లో ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు.ఒత్తిడి, అధిక స్క్రీన్ టైమ్, ఆహారపు అలవాట్లు(Excessive screen time and eating habits), పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల రాత్రుళ్ళు కంటికి కునుకు కరువవుతుంటుంది.
దాని ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.ఈ క్రమంలోనే నిద్ర పట్టేందుకు మందుల వాడుతుంటారు.
కానీ మందులతో అవసరం లేకుండా ఇప్పుడు చెప్పబోయే పొడిని పాలల్లో(milk) మిక్స్ చేసి తాగితే వద్దన్నా నిద్ర తన్నుకొస్తుంది.నిద్రలేమి సమస్య దూరమవుతుంది.
మరి ఇంతకీ ఆ పొడి ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు అవిసె గింజలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు గుమ్మడి గింజలు మరియు అరకప్పు సోంపు ను విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న అవిసె గింజలు, గుమ్మడి గింజలు, సోంపు (Flax seeds, pumpkin seeds, anise)వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజు నైట్ నిద్రించే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకుని అందులో వన్ టీ స్పూన్ తయారు చేసుకున్న పొడి మరియు రుచికి సరిపడా బెల్లం తురుము మిక్స్ చేసి తాగేయడమే.

నిద్ర సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ డ్రింక్ ను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.ఈ డ్రింక్ లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది మెలటోనిన్ మరియు సెరోటోనిన్ (Melatonin and serotonin)ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది ప్రశాంతమైన మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.అలాగే ఈ డ్రింక్ లో మెగ్నీషియం కూడా ఉంటుంది, ఇది కండరాలు మరియు నరాలను విశ్రాంతి తీసుకోవడానికి మద్దతు ఇస్తుంది.
కాబట్టి మందులతో అవసరం లేకుండా హాయిగా నిద్రపోవాలి అని భావించేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా పొడి తయారు చేసుకుని పాలలో మిక్స్ చేసి తీసుకోండి.మంచి ఫలితాలు పొందుతారు.