సాధారణంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణించేందుకు గంటలు, రోజుల సమయం పడుతుంది.కానీ, ఒక యువతి కేవలం మూడు సెకన్లలో మూడు దేశాలను సందర్శించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రావెలింగ్( traveling ) అంటే చాలా మందికి ఇష్టమైన అంశం.
ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసా వంటి అనేక డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి.కొన్ని దేశాల్లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉండటంతో ప్రయాణం కొంత సులభంగా మారుతుంది.
అయితే, ఒకేసారి మూడు దేశాలను సందర్శించాలంటే చాలా కష్టమైన పనిగా అనిపిస్తుంది.కానీ, ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఒక యువతి కేవలం 3 సెకన్లలో మూడు దేశాల సరిహద్దులను దాటింది.
ఈ వీడియోలో కనిపిస్తున్న యువతి పేరు సమ్రంగి సాధు జిలిక్.ఆమె ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ, ఇది జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం సరిహద్దు ప్రాంతం అని పేర్కొంది.ఆచెన్ నగరానికి సమీపంలో ఉన్న “డ్రీలాండెన్ పుంట్”( Dreilanden Punt ) అనే ప్రదేశంలో ఆమె ఈ అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసింది ఆమె.
ఈ ప్రదేశం ప్రత్యేకత ఏమిటంటే.ఇక్కడ ఒకే చోట నుంచి మూడు దేశాలకు వెళ్లే మార్గం ఉంటుంది.అంటే ఒక అడుగు జర్మనీలో, మరో అడుగు నెదర్లాండ్స్‌లో, ఇంకొక అడుగు బెల్జియంలో ఉండేలా ఈ ప్రాంతాన్ని డిజైన్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.ఇప్పటివరకు లక్షల మంది పైగా వీక్షించగా, వేలాది మంది లైక్ చేసి షేర్ చేశారు.అనేక మంది ఈ వీడియోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.