విద్యాబాలన్(Vidya Balan).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్.ఆమె నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.
అయితే బాలీవుడ్ లో నటిస్తూ కెరియర్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలోనే ఆమె తెలుగులో నటించడానికి చాలానే ప్రయత్నాలు జరిగాయి.అని ఊహించిన విధంగా ఫలితం లేకుండా పోయింది.
అయితే హీరోయిన్ వేషాలు తగ్గిపోయిన టైంలో నందమూరి బాలకృష్ణకు(Nandamuri Balakrishna) జోడీగా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ యన్.టి.ఆర్(NTR) సినిమాలో నటించింది.అందులో ఆమెది ఎన్టీఆర్ సతీమణి బసవతారకం(NTR’s wife Basavatarakam) పాత్ర.

సినిమా ఆడలేదు కానీ విద్యా చాలా బాగా నటించి మెప్పించింది.ఈ సినిమాకు గాను ఆమెకు మంచి మార్కులు పడడంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.అలాగే బాలయ్యతో(Balayya) ఆమెకు జోడీ కూడా బాగానే కుదిరింది.రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఇప్పుడు మళ్లీ విద్యా బాలన్ తో బాలయ్య నటించబోతున్నట్లు సమాచారం.ఆయన కొత్త చిత్రం అఖండ 2( akhanda 2) సినిమాలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.విద్యా హీరోయిన్ లలో ఒకరా అన్న దానిపై స్పష్టత లేదు.
కానీ ఆమె ఈ చిత్రంలో నటిస్తుండడం మాత్రం వాస్తవమట.

ఇకపోతే బాలయ్య బాబు నటిస్తున్న అఖండ 2 సినిమా విషయానికి వస్తే.బోయపాటి శ్రీను దర్శకత్వం(Directed by Boyapati Srinu) వహిస్తున్న ఈ సినిమా గతంలో విడుదల అయిన అఖండ సినిమాకు సీక్వెల్ గా తిరగెక్కుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే బాలయ్య బాబు తన గత నాలుగు సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ ను అందుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో కూడా తప్పకుండా విజయం సాధిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దసరా పండుగ కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
మరి ఈ సినిమా విడుదల అయ్యి ఇలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.ఈ ఏడాది సెప్టెంబరు 28న సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట.