మెగా157 భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న అనిల్ రావిపూడి.... ఎంతనో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)ఒకరు.ఇప్పటివరకు ఈయన చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి కొనసాగుతూ ఉన్నారు.ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేశారు.

 Do You Know How Much Anil Ravipudi Is Going To Receive For Mega 157 , Mega 157 ,-TeluguStop.com

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

Telugu Anil Ravipudi, Chiranjeevi, Anilravipudi-Movie

ఇక ఈ సినిమా తర్వాత మరో స్టార్ హీరోతో సినిమా చేయటానికి అనిల్ రావిపూడి సిద్ధమయ్యారు.మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) ఈయన సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.అంతే కాకుండ ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి.ప్రస్తుతం ఈ సినిమా మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులు జరుపుతోంది అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే అనిల్ రావిపూడి ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు.

Telugu Anil Ravipudi, Chiranjeevi, Anilravipudi-Movie

ఇలా సినిమాని ప్రమోట్ చేయడంలో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి అదే తరహాలో ప్రమోట్ చేస్తారని చెప్పాలి.ఇక ఇప్పటినుంచి ఈ సినిమా పనులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన అనిల్ వచ్చే ఏడాది సంక్రాంతికి కచ్చితంగా ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.అంతేకాకుండా ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్(Remuneration) తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంటే ముందుగా ఒక్కో సినిమాకు 10 నుంచి 12 కోట్ల వరకు ఈయన రెమ్యూనరేషన్ అందుకునేవారు.

ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి హిట్ కావడంతో చిరు సినిమా కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.ఇక ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా పటాస్ సినిమాకు 50 లక్షల అందుకున్న అనిల్ ఇప్పుడు 20 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అంటే ఈయన సక్సెస్ ఎలా ఉందో స్పష్టం అవుతుంది.

ఇక ఈయన డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా అనిల్ అడిగిన మొత్తంలో ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube