వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఏ దిక్కున పెట్టాలో తెలుసా?

సాధారణంగా మన ఇంట్లో మనకు ఎంతో ఇష్టమైన మనల్ని ఎంతగానో ప్రేమించే వారు చనిపోతే వారి జ్ఞాపకాలకు గుర్తుగా వారి ఫోటోలను మన ఇంట్లో పెట్టుకోవడం చేస్తుంటాము.ఇలా వారి గుర్తులను ఎంతో భద్రంగా దాచుకుంటాము.

 Do You Know In Which Directio -to Put The Photos Of The Dead According To Vastu-TeluguStop.com

ఈ క్రమంలోనే చాలా మంది చనిపోయిన కుటుంబసభ్యుల ఫోటోలను ఇంట్లో చాలా చోట్ల అలంకరిస్తారు.నిజానికి వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తగిలించకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అయితే చనిపోయిన వారి ఫోటోలను ఏ దిశలో పెట్టడం మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

చాలామంది వారికి అనుగుణంగా చనిపోయిన వారి ఫోటోలను పడకగది లేదా హాల్లో వేలాడదీయడం మనం చూస్తూ ఉంటాము.

నిజానికి చనిపోయిన వారి ఫోటోలను ఎల్లప్పుడూ కూడా పడకగదిలో ఉంచకూడదు.అదేవిధంగా చాలామంది దైవ సమానంగా భావించి దేవుని గదిలో ఉంచి పూజ చేస్తారు.

ఇలా దైవ సమానంగా భావించి పూజ చేయడంవల్ల ఆ దేవతల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది కనుక చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడూ కూడా దేవుని గదిలో ఉంచకూడదు.

ఇక చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.ఇలా ఉండటం వల్ల మన ఇంటి పై నెగిటివ్ ప్రభావం అధికంగా ఉంటుంది.చనిపోయిన వారి ఫోటోలను మన ఇంట్లో ఎల్లప్పుడు హాల్లో.

దక్షిణ గోడకు వేలాడదీయాలి.ఇలా చనిపోయిన వారి ఫోటోలను దక్షిణ గోడకు వేలాడదీస్తూ వారు ఉత్తరం వైపు చూసే విధంగా అమర్చుకోవాలి.

ఇలా అమర్చినప్పుడే మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి.మనం అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి.

అందుకే చనిపోయిన వారి ఫోటోలను ఎల్లప్పుడూ కూడా దక్షిణ గోడకు వేలాడదీయడం మంచిది.

Do You Know In Which Directio -to Put The Photos Of The Dead According To Vastu Shastra Vastu Shastra, Direction, Photos, Dead, - Telugu Vastu Shastra

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube