సాధారణంగా కొందరి ముఖ చర్మం చాలా జిడ్డుగా( Oily Skin ) కనిపిస్తూ ఉంటుంది.వాటర్ తో శుభ్రంగా ముఖాన్ని కడిగినా సరే మళ్లీ కొద్దిసేపటికి అదే పరిస్థితి ఎదురవుతుంది.
ఆయిలీ స్కిన్ మరియు విపరీతమైన చెమట కారణంగా చర్మం జిడ్డుగా తయారవుతుంది.ఫలితంగా మొటిమలు, మచ్చలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్( Black Heads ) తదితర చర్మ సమస్యలు తలెత్తుతాయి.
ఈ క్రమంలోనే జిడ్డు చర్మాన్ని వదిలించుకునేందుకు రసాయనాలతో నిండిన ఉత్పత్తులను ఉపయోగించడం ప్రారంభిస్తారు.కానీ జిడ్డు చర్మం కోసం కొన్ని సులభమైన మరియు ప్రభావవంతమైన హోం రెమెడీస్ ఉన్నాయి.
అందులో ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కూడా ఒకటి.
ఈ రెమెడీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ వేప పొడి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood Powder ) వేసుకోవాలి.చివరిగా ఒక కరక్కాయను పగలగొట్టి అందులో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఇది మీకు న్యాచురల్ ఫేస్ వాష్ పౌడర్ మాదిరిగా పనిచేస్తుంది.ఈ పౌడర్ ను ఎలా ఉపయోగించాలి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం.నేరుగా చేతిలోకి తయారు చేసుకున్న పౌడర్ ను ఒక స్పూన్ చొప్పున తీసుకుని అందులో రోజ్ వాటర్( Rose Water ) లేదా నార్మల్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా రోజుకు ఒకసారి కనుక చేశారంటే ముఖంలో అదనపు జిడ్డు తొలగిపోతుంది.అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.
ఫలితంగా మీ స్కిన్ ఫ్రెష్ గా మరియు గ్లోయింగ్( Glowing Skin ) గా మెరుస్తుంది.జిడ్డు చర్మం తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ పవర్ ఫుల్ రెమెడీని ట్రై చేయండి.
రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.అలాగే జిడ్డు చర్మాన్ని దూరంగా ఉండాలనుకుంటే బయట నుంచి వచ్చినప్పుడు కచ్చితంగా నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోండి.
జంక్ ఫుడ్, ఎక్కువ నూనె, కారం, మసాలాలు( Spicy Foods ), షుగర్ వంటి ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండండి.దుమ్ము ధూళి నుండి చర్మాన్ని రక్షించుకోండి.