Curd Ghee : పెరుగు, నెయ్యి ఒకేసారి తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

పెరుగు, నెయ్యి.ఇవి రెండు సూపర్ ఫుడ్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 Do You Know How Dangerous It Is To Eat Curd And Ghee At The Same Time-TeluguStop.com

పోషకాల పరంగా పెరుగు( Curd ) మరియు నెయ్యి( Ghee ) వేటికవే సాటి.రోజుకు ఒక కప్పు పెరుగు, రెండు స్పూన్లు నెయ్యి తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు చేకూరుతాయి.

అనేక జబ్బులకు ద‌రి చేర‌కుండా ఉంటాయి.పెరుగు మ‌రియు నెయ్యి.

ఇవి రెండు మన ఇమ్యూనిటీ పవర్ ను ( Immunity Power ) పెంచడానికి సహాయపడతాయి.ఎముకలను బలోపేతం చేస్తాయి.

మెదడు పని తీరును చురుగ్గా మారుస్తాయి.శరీరానికి బోలెడంత శక్తిని అందిస్తాయి.

చర్మాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా కాంతివంతంగా ఉంచుతాయి.

నెయ్యి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ను కలిగి ఉంటుంది.

పెరుగు గుండె ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.ఇలా చెప్పుకుంటూ పోతే పెరుగు మరియు నెయ్యి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నా కూడా పెరుగు, నెయ్యి ఒకేసారి లేదా కలిపి తీసుకోకూడదు.చాలా మంది భోజనంలో పచ్చళ్ళు, పొడులు, కూరల‌తో పాటు నెయ్యిని యాడ్ చేసుకుంటారు.

చివర్లో పెరుగుతో భోజనాన్ని ముగిస్తారు.ఇలా మీరు చేస్తున్నారా.? అయితే ఇకపై ఈ అలవాటును మానుకోండి.

Telugu Curd, Curd Benefits, Problems, Ghee, Ghee Benefits, Tips, Heart Problems,

నిజానికి పెరుగు మరియు నెయ్యి వరస్ట్ ఫుడ్ కాంబినేషన్( Worst Food Combination ) అని పలు నివేదికలు చెబుతున్నాయి.పెరుగు, నెయ్యి ఆరోగ్యపరంగా ఎంత మేలు చేసినప్పటికీ ఈ రెండిటిని ఒకేసారి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఒకేసారి పెరుగు మరియు నెయ్యిని తీసుకోవడం వల్ల మన మెటబాలిజం రేటు( Metabolism Rate ) నెమ్మదిస్తుంది.

కేలరీలు కరిగే వేగం తగ్గిపోతుంది.ఫలితంగా బరువు పెరుగుతారు.

నెయ్యి తింటే బరువు పెరుగుతామని భావిస్తుంటారు.

Telugu Curd, Curd Benefits, Problems, Ghee, Ghee Benefits, Tips, Heart Problems,

ఇందులో భాగంగానే నెయ్యిని కంప్లీట్ గా ఎవైడ్ చేస్తుంటారు.కానీ నిజానికి నెయ్యిని పరిమితంగా తీసుకుంటే ఎటువంటి బరువు పెరగరు.కానీ పెరుగుతో కలిపి తీసుకుంటే మాత్రం వెయిట్ గెయిన్( Weight Gain ) అవుతారు.

అంతేకాకుండా పెరుగు మరియు నెయ్యి ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.అజీర్తి, గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఫేస్ చేస్తారు.అందుకే పెరుగు తిన్నప్పుడు నెయ్యిని, అలాగే నెయ్యిని తిన్నప్పుడు పెరుగును అవాయిడ్ చేయండి.ఈ రెండిటిని వేరే వేరే సమయంలో తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube