ఎయిడ్స్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని అందరికి తెలిసిందే.ఒకసారి వస్తే ఇక నయం కాదని తెలిసిందే.
అయితే ఇప్పుడు గనేరియా కూడా అలాగే మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే ఈ వ్యాధి కోసం ఇస్తున్న యాంటీ బయోటిక్ మందులు ఏమాత్రం పనిచేయడం లేదట.
ఆ మందులకు కూడా బాక్టీరియా తట్టుకుని నిలబడుతుందని, దీంతో ఆ బాక్టీరియా సూపర్ బగ్‌గా మారిందని, దాన్ని నాశనం చేయడం కష్టంగా మారిందని సైంటిస్టులు చెబుతున్నారు.దీని బారిన పడి అనేక మంది ఇప్పుడు ప్రాణాలను కోల్పోతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గనేరియా అనే సెగవ్యాధి సురక్షితమైన శృంగారం లేకపోవడం వల్ల, ఆ వ్యాధి ఉన్నవారితో సేఫ్‌గా శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వస్తుంది.ఈ వ్యాధి రావడానికి నిసీరియా గొనోరియా అనే బాక్టీరియా కారణం.సెక్స్ లో పాల్గొన్న 2 నుంచి 5 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో తెల్లమైల వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొద్దిరోజుల తర్వాత మూత్రం నిలిచిపోవటం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోవటం లాంటి సమస్యలూ రావొచ్చు.ఈ బ్యాక్టీరియా కీళ్లు, గుండె, కళ్ల వంటి భాగాలకూ చేరితే రకరకాల సమస్యలు మొదలవుతాయి.
అమెరికా వాసులకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందట.
ప్రపంచ వ్యాప్తంగా గనేరియా బాధితులు పెరుగుతుండగా ఈ వ్యాధి పట్ల వైద్య ప్రపంచం ఆందోళన చెందుతోంది.
కానీ దీని గురించి ఇంకా చాలా మందికి తెలియడం లేదు.అది విచారించదగిన విషయం.
ఏటా అనేక కోట్ల మందికి గనేరియా వ్యాధి సోకుతూ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది.
గనేరియా గురించిన ఓ వార్త కూడా ఈ మధ్యే తెలిసినా దీన్ని ఏ మీడియా చానల్, వార్త పత్రిక కూడా ప్రసారం చేయలేదు, ప్రచురించ లేదు.అదేమిటంటే… హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ సైంటిస్టులతో కలిసి పూణెలోని జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థ తాజాగా ఓ ప్రయోగం చేసింది.ఈ ప్రయోగంలో భాగంగా ఢిల్లీ, పూణె, ముంబై, హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని అనేక మంది గనేరియా రోగులపై పరిశోధనలు చేశారు.
దీంతో తెలిసిందేమిటంటే… ఆ రోగుల్లో 124 మందిలో యాంటీ బయోటిక్ మందులకు సైతం లొంగని విధంగా బాక్టీరియా రోగ నిరోధకతను పెంచుకున్నాయట.ఇది చాలా ఆందోళన కలిగించే విషయం.
కానీ దీనిపై మన మీడియా ఏమీ చెప్పడం లేదు.
మనం ఎడాపెడా యాంటీ బయాటిక్స్ వాడేయడం వల్ల వచ్చిన దుస్థితి ఇది.మరిప్పుడు ఈ వ్యాధి తగ్గేందుకు మార్గం లేదా ? అంటే.ఉంది.
అది సురక్షితమైన శృంగారం.అలా చేయకపోతే చివరకు అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది.
దాంతో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.కనుక ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే.