చలి కాలం పోయి వేసవి కాలం వచ్చేసింది.ఎండలు ముదిరిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఈ వేసవి కాలంలో అధికంగా వేధించే సమస్యల్లో జిడ్డు చర్మం ఒకటి.ఉక్కపోత, చెమటల కారణంగా ఇట్టే ముఖం జుడ్డుగా మారిపోతుంటుంది.
ఇక ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసుకున్నా ఫలితం ఉండదు.అయితే వేసవిలో ఇబ్బంది పెట్టే జిడ్డు చర్మానికి చెక్ పెట్టడంలో పెసరి పిండి అద్భుతంగా సహాయపడుతుంది.
మరి పెసరిపిండి ఎలా ఉపయోగించాలి అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో పెసరి పిండి, పెరుగు మరియు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమానికి ముఖానికి పూతలా వేసి ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముఖంలో పేరుకుపోయిన జిడ్డు తొలగిపోయి ఫ్రెష్‌గా, కాంతివంతంగా మారుతుంది.
అలాగే ఒక బౌల్‌లో పెసరి పిండి, కలబంద గుజ్జు తీసుకుని బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుని అర గంట పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం కూల్ వాటర్‌తో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే జిడ్డు చర్మం దూరం అవుతుంది.అలాగే మొటిమలు, మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.
ఇక ఒక బౌల్ తీసుకుని.
అందులో పెసరి పిండి, నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమానికి ముఖానికి అప్లై చేసి పావు గంట పాటు ఆరనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చనిటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేసినా అధిక జిడ్డు సమస్య తగ్గుతుంది.
ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది.