రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో వైసిపి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్థానాలు గెలవడం జరిగింది.కానీ ఒకే ఒక్క తాడిపత్రిలో మాత్రం తన సత్తా ఎంతో ఋజువు చేశారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.
ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో వేయడం జరిగింది.దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి నాయకత్వం పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు ప్రశంసల వర్షం కురిపించాయి.
![Telugu Tadipathri, Ysrcp-Telugu Political News Telugu Tadipathri, Ysrcp-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2021/04/Prabhakar-Reddy-responds-to-party-boycott-of-Parishad-elections.jpg)
ఇలాంటి తరుణంలో పరిషత్ ఎన్నికల విషయంలో టీడీపీ పార్టీ అధిష్టానం బాయ్ కట్ చేయడం అనే విషయంపై తాజాగా చాలామంది కీలక నేతలు మండి పడుతూ ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.పరిషత్ ఎన్నికలను అధిష్టానం బహిష్కరించడం పట్ల కార్యకర్తలు నిరుత్సాహంగా ఉండటం నిజమే కానీ, అధిష్టానం నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
మరోవైపు పోటీలో లేకుంటే పోలీసులకు వన్ సైడ్ చేసినట్లు వచ్చే ఆరోపణలు ఉండవు కదా అంటూ సెటైర్లు వేశారు.
ఏది ఏమైనా జరగబోయే పరిషత్ ఎన్నికలు పార్టీ సింబల్ పై జరగనున్న నేపథ్యంలో ప్రజలు ఓటింగ్ కి వెళ్తున్న తరుణంలో టీడీపీ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ పార్టీ నేతలకు ఖర్చు లేకుండా చేసిందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.