తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాల( Remake Movies ) హవా ఒకప్పుడు బాగా కొనసాగేది.కానీ ఇప్పుడు మాత్రం రీమేక్ సినిమాలకు కాలం చెల్లిపోయిందనే చెప్పాలి.
ఏ స్టార్ హీరో రీమేక్ సినిమా చేసిన కూడా అసలు విజయం సాధించడం లేదు.ముఖ్యంగా చిరంజీవి,( Chiranjeevi ) వెంకటేష్,( Venkatesh ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి హీరోలు ఒకప్పుడు భారీగా రీమేక్ సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధించారు.
కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు చేసిన రీమేక్ సినిమాలకు కూడా పెద్దగా ఆదరణ అయితే లభించడం లేదు.మన తెలుగు హీరోలు సైతం పాన్ ఇండియా బాట పట్టి ముందుకు సాగుతున్న క్రమంలో ఇప్పుడు రీమేక్ సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది? అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.కాబట్టి మన ఇండస్ట్రీని కాదని రీమేక్ సినిమాల్లో కొత్తదనం ఏముంటుంది? తద్వారా పెట్టిన బడ్జెట్ పోవడం తప్ప ప్రేక్షకులు కూడా రీమేక్ సినిమాలను చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.మరి ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరి ఒరిజినల్ కథలతో సినిమాలు చేస్తు విజయాన్ని సాధిస్తే హీరోలకి కూడా మంచి గుర్తింపైతే వస్తుంది.అలా కాదని రీమేక్ బాట పడితే మాత్రం భారీ డిజాస్టర్లను మూటగట్టుకొక తప్పదు… రీ ఎంట్రీ లో ‘ఖైదీ నెంబర్ 150’( Khaidi No.150 ) సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక ఆ తర్వాత కూడా ‘భోళాశంకర్’( Bhola Shankar ) లాంటి సినిమాలను చేశాడు.ఇక పవన్ కళ్యాణ్ కూడా ‘ బ్రో ‘, ‘భీమ్లా నాయక్’ లాంటి సినిమాలు చేసినప్పటికి అవి పెద్దగా విజయం సాధించకపోవడం విశేషం…
.