ఈ మధ్యకాలంలో వయసు తేడా లేకుండా అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏదైనా ఉందంటే అది అధిక బరువు( Obesity ) అని చెప్పవచ్చు.అయితే బరువు తగ్గాలి అనుకుంటున్న వారు క్రమం తప్పకుండా యాపిల్ జ్యూస్( Apple Juice ) తీసుకుంటే సులువుగా బరువు తగ్గవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే యాపిల్ ద్వారా కూడా బరువు తగ్గవచ్చు అని చాలామందికి తెలిసి ఉండదు.బరువు తగ్గాలని( Weight Loss ) చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
కానీ ఎప్పుడు కూడా తమ డైట్లో యాపిల్ ను చేర్చుకోవాలని ఆలోచించి ఉండరు.అయితే బరువు తగ్గడం కోసం కేవలం డైట్ ఇవన్నీ కాకుండా కొన్ని చిట్కాలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

వాటిలో ఒకటి యాపిల్ జ్యూస్.బరువు తగ్గించే యాపిల్ జ్యూస్ ను ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.యాపిల్ జ్యూస్ ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.యాపిల్( Apple ) తరిగిన ఒక కప్పు తీసుకోవాలి.నిమ్మరసం( Lemon ) మూడు టేబుల్ స్పూన్లు, గ్రీన్ టీ బ్యాగ్( Green Tea ) ఒకటి, వీటన్నిటినీ 200 మిల్లీమీటర్ల వేడి నీటిలో వేసి బాగా నానబెట్టాలి.తర్వాత మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఒక కప్పు మీడియం సైజు యాపిల్ కట్ చేసి వేయాలి.
దీంతోపాటు తురిమిన అల్లం వేసుకోవాలి.ఆ తర్వాత చల్లారిన గ్రీన్ టీ వాటర్ తో సహా అన్ని వేసి బాగా కలుపుకోవాలి.

వీటన్నిటినీ మిక్సీలో పేస్ట్ లాగా చేసి గ్రైండ్ చేసుకోవాలి.ఇలా తయారు చేసిన బరువు తగ్గించే జ్యూస్ ను( Weight Loss Juice ) ఫిల్టర్ చేయకుండా ఉదయం, సాయంత్రం తాగాలి.దీంతో పాటు మంచి డైట్ పాటించాలి.ఇక కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది కాదు.అలాగే చేపలు, రొయ్యలు, చికెన్ తక్కువగా తీసుకోవచ్చు.ఇక అధిక బరువు ప్రభావం మానసిక స్థితి పై కూడా పడుతుంది.
ఇక ఊపిరితిత్తుల్లో వాయు మార్గాలు కూడా సంకోషిస్తాయి.ఇంకా చాలా నష్టాలు కూడా ఉన్నాయి.
అందుకే శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలి.