చుండ్రు (Dandruff )..
ప్రస్తుత వర్షాకాలంలో కోట్లాది మందిని అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్య ఇది.స్త్రీలే కాదు పురుషుల్లో కూడా ఎంతోమంది చుండ్రు సమస్యతో సతమతం అవుతుంటారు.చుండ్రు ను వదిలించుకోవడం కోసం ఖరీదైన షాంపూను వాడుతుంటారు.అలాగే తోచిన చిట్కాలను ప్రయత్నిస్తుంటారు.అయితే ఒక్కోసారి ఎన్ని చేసినా సరే చుండ్రు పోనే పోదు.దాంతో తెగ హైరానా పడిపోతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే.

ఈ రెమెడీ ఒకటి లేదా రెండు వాషుల్లోనే చుండ్రును పూర్తిగా దూరం చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో అర కప్పు ఉల్లిపాయ ముక్కలు( Onion slices ), నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు, నాలుగు లవంగాలు, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి పది నిమిషాల పాటు మరిగించాలి./br>

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ చల్లారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి ( Amla powder ) వన్ టేబుల్ స్పూన్ శీకాకై పొడి వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఈ రెమెడీని ఒక్కసారి పాటిస్తే చాలు చుండ్రు చాలా వరకు పోతుంది.ఇంకా కనుక చుండ్రు ఉంటే మరో రెండు మూడు సార్లు ఈ రెమెడీని ట్రై చేయండి.
చుండ్రు పూర్తిగా దూరమవుతుంది.స్కాల్ప్ లోతుగా శుభ్రం అవుతుంది.
పైగా ఈ రెమెడీ మీ కురులను హెల్తీగా స్ట్రాంగ్ గా మారుస్తుంది.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.
జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.మరియు జుట్టు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతుంది.







