బ్రో మూవీ( Bro movie ) ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్, ప్రియా వారియర్, కేతిక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదల అయ్యింది.
ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా, ఈ చిత్రం మొదటి షో పూర్తయిన తర్వాత బయటకు వస్తున్న ప్రేక్షకుడు మాత్రం పూర్తి స్థాయి సంతృప్తి తో రావడం తో లేదు.ఈ మధ్య కాలంలో ఎదో ఒక మలయాళ సినిమాను తీసుకొని దానికి లేని పోనీ ఇమేజ్ బిల్డప్స్ యాడ్ చేసి విడుదల చేయడం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బాగా అలవాటుగా మారిపోయింది.

వినోదయ సీతం రీమేక్ గా వచ్చిన బ్రో మూవీ కూడా అందుకు విరుద్ధం ఏమి కాదు.పవన్ కళ్యాణ్( Pawan kalyan ) లాంటి వ్యక్తిని దేవుడిగా చూపించడం అంటే అందుకు బలమైన ఎమోషన్స్ ఉండాలి.ఏది వస్తే దాన్ని తీసుకోవాలి అనే మెసేజ్ ని దర్శకుడు ఇవ్వాలని ప్రయత్నించినా ఎందుకో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాను హిట్ అని చెప్పడానికి ఒప్పుకోవడం లేదు.అందుకు గల మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

ఫ్యాన్స్ కోసం బలమైన మీనింగ్ ఉండే ఒక కథను హీరో భజన కార్యక్రమంలా మార్చేయడం తో ఈ సినిమా మూలం దెబ్బ తింది.సినిమాలో హీరోయిన్స్ కి పెద్దగా ప్రాధాన్యత లేదు.అందులో ముఖ్యం ప్రియా వారియర్ అయితే జూనియర్ ఆర్టిస్ట్ కన్నా కాస్త పెద్ద పాత్ర చేసింది.థమన్ అందించిన సంగీతం ఏమంత్రం ఆసక్తికరంగా లేదు.బీజీఎమ్ పర్వాలేదు కానీ పాటలు మాత్రం గోరం గా ఫెయిల్.హీరో కనిపిస్తే చాలు అనుకున్నాడేమో డైరెక్టర్ కథ పై ఫోకస్ తగ్గించాడు.
నాణ్యత తక్కువగా ఉన్న విఎఫ్ఎక్స్ సినిమా ను హైలెట్ చేయకపోయాయి.ఈ చిత్రం లైన్ మొత్తం గోపాల గోపాల సినిమా స్టైల్ లోనే కనిపిస్తుంది.
ఈ సినిమా చూస్తున్నంత సేపు గోపాల గోపాల సినిమా( Gopala Gopala ) గుర్తుకు వస్తు ఉంటుంది.పవన్ కళ్యాణ్ ది కేవలం అతిధి పాత్ర అయితే బాగుండేది కానీ సాయి ధరమ్ తేజ్ పాత్ర లెన్త్ కూడా బాగా తగ్గిపోవడం వల్ల అతడికి కెరీర్ కి ఈ చిత్రం పెద్దగా ఉపయోగపడదు ఈ చిత్రం.







