ఇటీవల రోజుల్లో కోట్లాదిమంది కంటి నిండా నిద్ర లేకపోవడం( Insomnia ) వల్ల ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తున్నారు.సరైన నిద్ర మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
అందుకే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర కచ్చితంగా అవసరమని నిపుణులు పదే పదే చెబుతుంటారు.అయితే కొందరికి ఎంత ప్రయత్నించిన కూడా నిద్ర పట్టదు.
దాంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.ఈ నేపథ్యంలోనే రాత్రుళ్లు మంచి నిద్రను ప్రేరేపించే ఆహారాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి ధాన్యాల్లో మెలటోనిన్ మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
వీటిని నైట్ టైమ్ డిన్నర్ లో ( Dinner ) తీసుకోవడం వల్ల మంచి నిద్రకు అద్భుతంగా సహాయపడతాయి.

అలాగే చాలా మంది ఉదయం పూట పాలు తాగుతుంటారు.ఎవరైతే రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదని సతమతం అవుతున్నారో వారు నైట్ టైమ్ పాలు( Milk ) తీసుకోవడం అలవాటు చేసుకోండి.పసుపు పాలు, ఖర్జూరం పాలు లేదా కుంకుమపువ్వు పాలు తాగితే ఇంకా మంచిది.
పాలలో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఉంటుంది.ఇది సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి నిద్రలేమిని దూరం చేస్తుంది.
ఒత్తిడిని తగ్గించి, రిలాక్సేషన్‌ను కలిగిస్తుంది.
బాదం, వాల్‌నట్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు కూడా మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.
రెగ్యులర్ గా ఈ నట్స్ అండ్ సీడ్స్ ను తగిత మోతాదులో తీసుకుంటే ప్రశాంతమైన నిద్రతో పాటు మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చెర్రీలు, కివి వంటి పండ్లు నిద్రకు ఉపక్రమిస్తాయి.చెర్రీలు( Cherries ) సహజ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి నిద్రను మెరుగుపరిస్తే.కివి పండ్లు సెరోటోనిన్ స్థాయిలను పెంచి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.
నిద్రలేమికి అశ్వగంధా టీ చక్కని ఔషధంలా పని చేస్తుంది.రోజుకు ఒక కప్పు అశ్వగంధా టీ తాగితే రాత్రుళ్లు నిద్ర తట్టుకొస్తుంది.నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.
ఇకపోతే రాత్రివేళ మంచి నిద్రను పొందాలనుకుంటే కాఫీ, టీ, కార్బొనేటెడ్ డ్రింక్స్ ను ఎవైడ్ చేయాలి.
అధిక కొవ్వు లేదా గ్రీసీ ఫుడ్ ను దూరం పెట్టాలి.మసాలా అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం కూడా మానుకోవాలి.