తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ను విస్తరించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఏది ఏమైనా కూడా స్టార్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లాంటి స్టార్ సైతం ఇప్పుడు మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నమైతే చేస్తున్నాడు.
ఇక తన ఎంటైర్ కెరియర్ లో కొన్ని మంచి సినిమాలను మిస్ చేసుకున్న విషయం ఎవరికీ తెలియదు.నిజానికి విజయ్ దేవరకొండ ‘ఆర్ఎక్స్ 100’( RX 100 ) లాంటి ఒక సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నాడు.

అజయ్ భూపతి( Ajay Bhupathi ) మొదటగా ఈ సినిమా స్టోరీని విజయ్ దేవరకొండ కి వినిపించారట.కానీ విజయ్ మాత్రం ఆ కథను రిజెక్ట్ చేశాడు కారణం ఏంటి అంటే అర్జున్ రెడ్డి సినిమా టైపులోనే ఈ సినిమా కూడా ఉండడం దానివల్ల రెండు సినిమాలకు సిమిలారిటీ వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆయన ఆ కథను రిజెక్ట్ చేశారట…ఇక నాని హీరోగా వచ్చిన దసరా సినిమాని( Dasara Movie ) కూడా విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.కారణం ఏదైనా కూడా ఈ సినిమా విజయ్ దేవరకొండకు చాలా బాగా సెట్ అయ్యేది.

తెలంగాణ నేపథ్యంలో సాగుతున్న కథ కావడం వల్ల ఈ సినిమా విజయ్ చేసి ఉంటే చాలా అద్భుతంగా ఉండేదని యావత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వ్యక్తులు వాళ్ల అభిప్రాయాలను అయితే తెలియజేశారు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో నాని మాత్రం 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు… మరి ఇకమీదట మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లుగా నిలుపుతు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.







