సినిమా అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.కారణం ఏంటి అంటే స్క్రీన్ మీద ప్రేక్షకుడు హీరోలను మాత్రమే చూస్తూ ఉంటారు కాబట్టి సినిమా అంటే వాళ్లదే అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోతాడు.
అందువల్లే ఒక సినిమా చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి చూపిస్తున్నారు.అంటే దానికి కారణం హీరోలనే చెప్పాలి.
ఇక స్టార్ హీరోలు సైతం తమను తాము స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే సందర్భంలో ప్రేక్షకులు మాత్రం వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయించి వాళ్లను, వాళ్ల వారసత్వాలను కూడా అంగీకరిస్తూ ముందుకు తీసుకెళుతున్నారు.

ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నట వారసులు ఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ లను సాధిస్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇప్పుడు కూడా భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నారు.సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు.

పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో అక్కినేని ఫ్యామిలీ( Akkineni Family ) మాత్రం కొంతవరకు తడబడుతుంది.నాగచైతన్య( Naga Chaitanya ) రీసెంట్ గా తండేల్( Thandel ) సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించినప్పటికి తన తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నాడనే దానిమీద ఇప్పుడు ఆసక్తి అయితే నెలకొంది.వీరూపాక్ష సినిమా డైరెక్టర్ ఆయన కార్తీక్ వర్మ దండు తో( Karthik Varma Dandu ) ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాను చేస్తున్నాడు.మరి ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ సాధిస్తే ఆయనకు తిరుగులేదని ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు కూడా కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు.