అనుష్క… అసలు టాలీవుడ్ లో వివాదాల జోలికి వెళ్ళని ఒకే ఒక ఆర్టిస్ట్.ఇండస్ట్రీ లో ఆమె చాలా సున్నిత మనస్కురాలు అని పేరు ఉంది.
పైగా ఆమెది ఎంతో మంచి మనసు కలది.ఎంతోమందికి సహాయం చేస్తుంది ఎంతో మర్యాదగా ఉంటుంది.
ఎవరిని తన మాటలతో నొప్పించదు.అలాంటి అనుష్కని కన్నీరు పెట్టేలా చేశారు తమిళనాడు మేకప్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు.
దానికి గల ప్రధాన కారణం అసోసియేషన్ లో మెంబర్ కానటువంటి ఒక వ్యక్తిని తన దగ్గర మేకప్ పర్శన్ గా పెట్టుకోవడమే.
అనుష్క సాధారణంగా అందరిని ఇట్టే నమ్మేస్తుంది.
అలా తనకు తెలిసిన ఒక మనిషిని అసోసియేషన్ మెంబర్ కాకపోయినా సరే తన దగ్గర పెట్టుకుంది.ఆ విషయం తమిళనాడులోని మేకప్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి తెలియడంతో సినిమా షూటింగ్ లో ఉన్న అనుష్క పై గొడవకు దిగారు.
దాంతో విషయం చాలా పెద్దదయింది.ఆ సంఘటనతో ఆమె చాలా బాధపడింది.
అంతేకాదు షూటింగ్ లొకేషన్ లో కన్నీరు కూడా పెట్టుకుంది.ఆ సమయంలో హీరో కార్తీతో కలిసి ఒక సినిమా షూటింగ్ చేస్తోంది అనుష్క.
మేకప్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఒక 30 మంది గొడవకు దిగారు.
ఇక హీరో కార్తీ జోక్యం చేసుకొని అక్కడ ఉన్న అనుష్క మేకప్ ఆరిస్ట్ ని షూటింగ్ సెట్ నుంచి బయటకు పంపించాడు.అంతేకాదు అనుష్కని ఓదార్చాడు.అసోసియేషన్ వారితో మాట్లాడి విషయం సర్దుకొనేలా చేశాడు.
అయితే అనుష్క అలా కన్నీరు పెట్టుకుని బాధపడటం అందరిని కలచి వేసింది.సాధారణంగా ఒక సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందంటే చాలు.
అయితే అనుష్క కు మొదటి నుంచి సినిమా షూటింగ్ జరిగాక యూనిట్ లో ఉన్న టెక్నీషియన్స్ అందరికీ కూడా బహుమతులు ఇచ్చే అలవాటు ఉంది.అనుష్క గొడవ తర్వాత ఆమె చాలా బాధ పడిందట.
దాంతో ఎవ్వరికి ఎలాంటి బహుమతులు అప్పటినుంచి ఇవ్వడం మానేసిందట.