హైదరాబాద్ లోని నిజాం కాలేజీ విద్యార్థినీలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి చర్చలు జరిపారు.గత పదిహేను రోజులుగా హాస్టల్ కోసం డిగ్రీ విద్యార్థినులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
అయితే యాభై శాతం పీజీ విద్యార్థులకు, యాభై శాతం డిగ్రీ విద్యార్థులకు భవనాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే ఈ ఆప్షన్ కు డిగ్రీ విద్యార్థులు ఒప్పుకోవడం లేదు.
వంద శాతం హాస్టల్ తమకే కావాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.హాస్టల్ కేటాయింపు విషయంలో ఓయూ వీసీ, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ పై మంత్రి సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ హాస్టల్ కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.