సాధారణంగా చాలా మంది ప్రజలు ఉంగరాలను( rings ) వారికి నచ్చిన విధంగా రకరకాల డిజైన్స్ లో దేవతా విగ్రహాలను ( Deity idols )బంగారు, వెండి లోహాలతో తయారు చేయించుకుని చేతి వేళ్ళకు ధరిస్తూ ఉంటారు.అయితే అసలు ఈ దేవత విగ్రహాలను చేతికి ఎటు వైపుగా ధరించాలి అనే దాని మీద ఎవరికి సరైన అవగాహన ఉండదు.
ఈ విషయం తెలియకుండా చాలా పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి.అసలు ఈ విగ్రహ రూపాలున్న ఉంగరాన్ని ఎలా ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జాతకరీత్యా దోషాలు ఉంటే వాటిని నివారించడానికి దోష నివారణకు కొన్ని రకాల ఉంగరాలను ప్రత్యేకంగా ధరిస్తారు.అయితే వీటిని ధరించే ముందు ఉంగరాలను పాలతో కడిగి దైవ సన్నిధిలో ధరించడం ఎంతో మంచిదని వేద పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే ఆడవారు బహిష్టు సమయంలో మెడలో ధరించే ప్రతిమలను, ఉంగరాలను ముందుగా తీసివేయడం మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే దేవుడి రూపంలో ఉండే ఉంగరాలు, గొలుసులను ధరించగానే సరిపోదు.దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి.దేవుడి ప్రతిమతో ఉండే ఉంగరాలు, గొలుసులకు దేవాలయాలలో తగిన పూజలు, అభిషేకాలు చేసిన తర్వాతే ధరించడం మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే కుడి చేతికి పెట్టుకున్నా ఉంగరాన్ని ఎప్పుడు కూడా ఎంగిలి అంటకుండా చూసుకోవడం ఎంతో మంచిది.

అలాగే దేవుడి ప్రతిమలు ఉన్న దాన్ని ఎడమ చేతికి అస్సలు ధరించకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే మద్యపానం, దుమాపానం( Alcohol and smoking ) చేసేవారు ఈ దైవ ప్రతిమలు ఉన్న ఉంగరలను ధరించకపోవడమే ఉత్తమమైన పని.ఇక చేతికి ధరించిన ఉంగరాన్ని కళ్ళకు అద్దుకునేటప్పుడు మన చేతిని ముడుచుకొని నమస్కరించుకోవాలి.ఇలా చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు అని వేద పండితులు చెబుతున్నారు.







