పరమేశ్వరుడు పులి చర్మం పై ఎందుకు కూర్చుంటాడో తెలుసా..?

శివాలయంలో ( Shivalayam )ఎప్పుడు కూడా శివుడు( Lord shiva ) లింగ రూపంలోనే దర్శనం ఇస్తారు.కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం శివుని విగ్రహం కూడా ఉంటుంది.

 Do You Know Why Lord Shiva Sits On The Skin Of A Tiger..? Lord Shiva , Tiger ,-TeluguStop.com

అయితే విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చే శివుడు పులి చర్మం పై ధ్యానముగ్ధుడై కూర్చొని కనిపిస్తాడు.అయితే ఈ సృష్టిలో చాలా రకాల జంతువులు ఉన్నప్పటికీ కేవలం పులి చర్మం పైన మాత్రమే ఎందుకు శివుడు కూర్చుంటాడు అన్న సందేహం చాలా మందికి కలుగుతుంది.

అయితే పులి చర్మం పై మాత్రమే కూర్చోడం వెనక ఒక పెద్ద చరిత్ర ఉందని మన పండితులు చెబుతున్నారు.శంకరుడు సర్వసరంగా పరిత్యాగి, దిగంబరుడిగా అరణ్యాలు, స్మశానాల్లో తిరుగుతూ ఉండేవాడు.

అయితే ఒక రోజు ఆ మార్గంలో వెళుతున్న శివుడిని చూసిన ఓ మునికాంతలు ఆ తేజస్సుకి, సౌందర్యానికి చూపు తిప్పుకోలేకపోయా.రు నిత్యమాయన్ని చూడాలని కాంక్ష మునికాంతలలో పెరిగిపోయింది.గృహంలో నిర్వహించాల్సిన దైవకార్యాలు, నిత్య కృత్యాలు కూడా శివుడిని తలుచుకుంటూనే చేసేవారు.అయితే తమ భార్యల్లో ఎప్పుడూ కనిపించని ఈ మార్పునకు కారణం ఏంటో అని ఆలోచనలో పడిన మునులకు పరమేశ్వరుని చూసి ఒక ఆలోచనకు వచ్చారు.

శివుడిని దారి మరల్చాలని ఓ గుంత తవ్వి పులిని బయటకు వచ్చేలా చేశారు.అయితే ఆ తర్వాత శివుడి వారి ఆలోచనలను గ్రహించి తనపై ఎగబడిన పులిని ( Tiger )సంహరించాడు.ఇక మునుల చర్య వెనుకున్న ఉద్దేశం గ్రహించి పులి తోలుని తన దిగంబర శరీరానికి కప్పుకున్నాడు.ఇక పులి అమితమైన పరాక్రమానికి ప్రతీక, సంహారకారి, భయానకమైనది.

అయితే అలాంటి పులి కూడా లయకారుడైన పరమేశుని ఎదుట నిలవలేదని, కాల స్వరూపునీ ఎదుట నిలబడ గలది ఏది కూడా లేదని దీనికి అర్థం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube