దేశవ్యాప్తంగా ఉగాది పండుగను కొన్ని రాష్ట్రాల వారు ఏ విధంగా జరుపుకుంటారో తెలుసా..!

తెలుగు వారికి అతి పెద్ద పండుగ, అతి ముఖ్యమైన పండుగ ఉగాది పండుగ అని చెప్పవచ్చు.తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవడంతో ఈ పండుగను తెలుగువారు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.

 Imprtance Of Ugadi Festival In Different States, Ugadi Festival , Ugadi Festiv-TeluguStop.com

ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు సంవత్సరం మొదలవుతుంది.ఈ రోజునే ఉగాది పండుగను జరుపుకుంటారు.

తెలుగు పండుగలు కుల మత అని తేడా లేకుండా, కేవలం తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా పలు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ పండుగను జరుపుకుంటారు.ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఈ పండుగను దేశంలోని పలు రాష్ట్రాలలో ఏ విధంగా జరుపుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ:

ఉగాది పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.పురాణాల ప్రకారం విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తిన రోజు కూడా చైత్ర శుద్ధ పాడ్యమి.

ఈ రోజున ఎంతో ఘనంగా భక్తులు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.ఇంటిని ప్రత్యేకంగా అలంకరించుకుని పూజలు, కొత్త బట్టలు, వివిధ రకాల పిండి వంటలను తయారు చేసుకుంటారు.

ముఖ్యంగా ఉగాది అంటేనే అందరికీ గుర్తొచ్చేది షడ్రుచులతో తయారుచేసిన పచ్చడి.ఉగాది పండుగకు ఈ పచ్చడి ఎంతో ముఖ్యమైనది.కొత్త సంవత్సరం ఈ రోజు ప్రారంభం కావడంతో పంచాంగ శ్రవణం చేస్తారు.

Telugu Hindus, Imprtanceugadi, India, Pooja, Ugadi Festival, Ugadifestival-Telug

కర్ణాటక:

కర్ణాటకలో ఈ రోజు చైత్ర నవరాత్రి ప్రారంభం అవుతుంది.ఈ పండుగ కర్ణాటక వాసులకు ఎంతో ముఖ్యమైనది.ఈ తొమ్మిది రోజులను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.ఈ నవరాత్రులలో చివరి రోజున శ్రీరామ నవమిగా జరుపుకుంటారు.

మహారాష్ట్ర:

మహారాష్ట్ర ప్రజలు ఉగాది పండుగను గుడి పద్వాగా జరుపుకుంటారు.పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మ దేవుడు ఈ సృష్టిని సృష్టించాడని అక్కడి ప్రజల నమ్మకం.ఈరోజు సత్య యుగం ప్రారంభమైందనే నమ్మకంతో వివిధ రకాల ఆచారవ్యవహారాలను పాటిస్తారు.

ఇంటి ముందు అందమైన రంగ వల్లులను వేసి ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube