ఈ సమయంలో తులసి చెట్టుకు అస్సలు నీరు పోయకూడదు.. ఎందుకో తెలుసా?

హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి చెట్టుకు( basil tree ) ఎంతో ప్రాధాన్యత ఉంది.

అలాగే తులసి చెట్టును ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి( Goddess Lakshmi ) ప్రతిరూపంగా భావిస్తారు.

అలాగే తమ ఇంటి గుమ్మం ఎదురుగా ఉంచుకొని ప్రతిరోజు మహిళలు పూజిస్తూ ఉంటారు.దీని వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని వారి భావన.

అలాగే కొన్ని సమయాల్లో తులసి చెట్టుకు నీరు సమర్పించకూడదని మన పురాణాలు చెబుతున్నాయి.అయితే ఎలాంటి సమయాల్లో తులసి చెట్టుకు నీరు పోయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి చెట్టుకు పూజ చేసే సమయం ఉదయం మాత్రమే నీరు సమర్పించాలి.సాయంత్రం పూట తులసి చెట్టుకు నీరు అస్సలు వేయకూడదు.

Advertisement

దీని వలన తులసి మొక్క అపవిత్రంగా మారి ఎండిపోయే అవకాశం ఉందని వేద పండితులు చెబుతున్నారు.ఋతుస్రావం లో ఉన్న ఆడవారు ఎవ్వరు కూడా తులసి దరిదాపులకు కూడా వెళ్ళకూడదు.

అలా వెళ్లడం వలన లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి, పూజించే తులసి చెట్టు అపవిత్రంగా మారిపోతుంది.

దీని వల్ల మన ఇంట్లో ఉన్న సుఖసంతోషాలు సమిసిపోతాయి.ఇక తులసి మొక్కకు లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించబడింది.అందుకే మన కుటుంబంలో సంతోషం, ఆరోగ్యం, పొందడానికి ప్రతి రోజు కూడా ఉదయాన్నే మహిళలు తులసి మొక్కకు నీరు సమర్పించాలని పెద్దలు చెబుతుంటారు.

కానీ ఆదివారం పూట మాత్రం తులసికు అస్సలు మీరు పోయకూడదు.ఎందుకంటే శ్రీమహావిష్ణువు( Lord Vishnu ) తల్లి తులసికి ఆదివారం ఎంతో ఇష్టమైన రోజు.కనుక ఆరోజు తులసి తల్లి విష్ణు కోసం నిజవ్రతాన్ని పాటిస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
These Face Packs Help To Get Smooth Skin Details Face Packs

మనం ఆదివారం నీటిని సమర్పిస్తే ఆమె ఉపవాసం భంగం కలుగుతుంది.

Advertisement

అందుకే ఆదివారం పూట తులసికి నీరు అసు పోయకూడదు.విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా ఏకాదశి రోజు భావించబడింది.అంతేకాకుండా తులసి దేవికి కూడా ఆరోజు చాలా ప్రీతికరం.

ప్రతి ఏకాదశి రోజున తులసి దేవి మహావిష్ణువు కోసం నీళ్లు తాగకుండా ఆ రోజు వ్రతం చేస్తుంది.అందుకే ఆ రోజున తులసి దేవికి నీరు సమర్పించకూడదు.

అలాగే తులసి ఆకులను తెంపకూడదు.ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు.

జీవితంలో నెగిటివిటీ వస్తుంది.ఒకవేళ ఇలా తరచూ చేస్తే తులసి చెట్టు కూడా ఎండిపోతుంది.

తాజా వార్తలు