పుల్లల చెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో స్వయంభుగా వెలసిన సంతాన వేణుగోపాల స్వామి తీరునాళ్ల మహోత్సవం గురువారం ఘనంగా ప్రారంభమవుతుంది.ఇంకా చెప్పాలంటే గురువారం సుప్రభావా సేవతో పూజలు మొదలవుతాయని దేవాలయ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.
అదే విధంగా భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని పూజలు నిర్వహిస్తారని గ్రామస్తులు వెల్లడించారు.అంతే కాకుండా భక్తులకు అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయని కూడా వివరించారు.
సాయంత్రం పూట గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.అంతే కాకుండా ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పోలీస్ అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయ చరిత్ర 62 సంవత్సరాల క్రితం ముటుకుల గ్రామ సమీపంలోని ఒక రైతు తన పొలంలో అరక దున్నుతుండగా నాగలికి స్వామి వారి విగ్రహం తగిలి బయటపడింది.దీని వల్ల ఆ గ్రామస్తులు స్వామి వారి విగ్రహాన్ని బయటకు తెచ్చి అప్పటి నుంచి పూజలు చేయడం మొదలుపెట్టారు.గ్రామస్తులు గత 59 ఏళ్ల నుంచి మార్చి నెలలో పాల్గుణ బహుళ విదియ నాడు ఘనంగా తిరుణాళ్లను నిర్వహిస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే చుట్టు పక్కల గ్రామాల నుంచి 6 విద్యుత్ ప్రభాత పూజ,కలశ అభిషేకము,మంగళ హారతి,,స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం, ఏర్పాటు చేసి పలు సంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.మార్చి 9వ తేదీన గురువారం ఉదయం ప్రభాత పూజ, మంగళ హారతి, గ్రామోత్సవము, స్వామివారి వార్షిక కళ్యాణోత్సవము,10వ తేదీన ప్రభాత పూజా, సహస్రనామార్చన, పోన్నమాను ఉత్సవం, 11వ తేదీన ప్రభాత పూజ,సహస్రనామార్చన, పొంగళ్లు, అశ్వవాహన ఉత్సవం నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.