సంక్రాంతి రోజు ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారు?

ప్రతిరోజూ ఉదయమే ఇంటి ముందు కళ్లాపి జల్లి ముగ్గు పెట్టడం మనం సంప్రదాయం.కొన్ని చోట్ల ప్రతి రోజూ కాకపోయినప్పటికీ వారంలో ఏవో కొన్ని రోజుల్లో తప్పనిసరిగా ముగ్గులు పెడతారు.

 Why Do Put Muggu Infront Of Home On Sankranthi, Muggu, Sankranthi , Lakshmi Dev-TeluguStop.com

అందులోనూ సంక్రాంతి రోజు ప్రత్యేకంగా ముగ్గులు వేస్తారు.ఇందుకు ముఖ్య కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సంపదకి అధిదేవత లక్ష్మీదేవత.లక్ష్మీ దేవి ప్రతి రోజు ఉదయం ఇంటి ముందుకు వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

అలా లక్ష్మీ దేవి ఇంటి ముందుకు వచ్చినప్పుడు… ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా తుడిచి, కళ్లాపి జల్లి, ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీ దేవి వస్తుందని పెద్దలు చెబుతుంటారు.ఇంట్లోకి వచ్చిన అమ్మవారు సకల సంపదలతో పాటు ఆయురారోగ్యాలను, ధన ధాన్యాలను, సుఖ శాంతులను తీసుకొస్తుందని ప్రాశస్తి.

అందుకే తెల్లవారు జామున ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని అంటారు.

అందుకే పండుగల రోజు ప్రత్యేకంగా ముగ్గులు వేస్తారు.

వీటినే రంగవళ్లులు అని కూడా పిలుస్తారు.వివిధ రకాల రంగులతో ఇంటి ముందు ముగ్గులు పెట్టడం ఓ కళ.వీటిపై గొబ్బెమ్మలు పెడుతూ.పూలు కూడా ఉంచుతారు.

ఇదంతా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేందుకే.అర్చనకు, ధ్యానానికి, యోగానికి అనువైన సమయం సంక్రాంతి.

అందుకే ఈ రోజు లక్ష్మీదేవి కసం ప్రత్యేకమైన ముగ్గులు వేస్తుంటారు.

అంతే కాకుండా ఇంటి ముందు కళ్లాపి జల్లి ముగ్గు పిండితో ముగ్గు వేస్తే.ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటికాలు రావు అనేది సైటింఫిక్ రీజన్.అలాగే ముగ్గు వేస్తున్నంత సేపు పైకి కిందకూ వంగుతూ ఉండాలి.

అలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.కారణం ఏదైనప్పటికీ ఇంటి ముందు ముగ్గు పెట్టడం వల్ల మంచే జరుగుతుంది.

అందుకు ప్రతిరోజూ లేదా వారంలో ఏదో రోజు కచ్చితంగా ముగ్గు పెట్టాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube