ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలోనీ ప్రజలు ఎన్నో రకాల ఆచారాలను, సాంప్రదాయాలను( Traditions ) పాటిస్తూ ఉంటారు.అలాగే శ్రావణ మాసంలో అమ్మవార్లతో పాటు మహా శివుడిని( Lord Shiva ) కూడా పూజిస్తూ ఉంటారు.
ఈ మాసం శివుడి పూజ చేయడానికి, మంత్రాన్ని పఠించడానికి ఉత్తమమైన మాసం అని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే సోమవారం రోజు ఈ పనులు చేయడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
సోమవారం పాటించాల్సిన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీ కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం రోజు మహాశివుడిని పూజించి 108 సార్లు ఈ ఓం నమః శివాయ మంత్రాన్ని పటించాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యం, సంతోషం రెండు ఎప్పుడూ ఉంటాయి.అలాగే మీ ఇంటి ఖజానా ఎప్పుడు నిండుగా ఉండడానికి సోమవారం రోజు 1.25 కిలోల బియ్యాన్ని తీసుకోవాలి.అందులో కొంత శివుని దేవాలయంలో సమర్పించాలి.
మిగిలిన బియ్యాన్ని ఎవరికైనా దానం చేయడం మంచిది.ఇలా చేయడం వల్ల మీకు ఎల్లప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.
ఇంకా చెప్పాలంటే ఏదైనా పనిలో విజయం సాధించాలంటే మీ ఇంట్లో కొమ్ములు లేని జింక చిత్రాన్ని( Deer picture ) ఉంచుకోవాలి.

ఈ ఫోటోను ఇంట్లో ఉంచుకుంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.అలాగే మీ కెరియర్ కోసం ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకోలేకపోతే ఈ రోజున మీరు శివలింగానికి ఎర్రటి పువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయడం ఎంతో మంచిది.అలాగే ఓం అనే శబ్దాన్ని జపిస్తూ ఉండాలి.
ఇలా చేయడం వల్ల మీ కెరియర్ లో పురోగతిని సాధిస్తారు.అలాగే మీరు ఏ పని చేసినా ఆటంకాలు రాకుండా ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే మీరు ఎంత సంపాదించినా ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం.ఆరోగ్యం( Health ) బాగుండాలంటే మీ ఇంటికి సమీపంలో ఏదైనా శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన నీటిలో కొన్ని చుక్కలు పాలు, గంగాజలం కలిపి శివలింగానికి సమర్పించాలి.
ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL







