దేవ్ దీపావళి అంటే ఏమిటి? ఈ పండుగను వారణాసిలో ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

దేవ్ దీపావళి( Dev Diwali ) అనేది హిందూ ధర్మంలోని ముఖ్యమైన పండుగలలో ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.ఈ పవిత్రమైన పండుగను ప్రజలు ఎంతో సంతోషంగా, వైభవంగా జరుపుకుంటారు.

 Dev Diwali 2023 Date And Significance Why It Is Celebrated In Varanasi Details,-TeluguStop.com

ఈ ఏడాది దేవ్ దీపావళిని నవంబర్ 26 వ తేదీన ఆదివారం రోజు జరుపుకున్నారు.ఈ గొప్ప పండుగను దేవ్ దీపావళి అని కూడా పిలుస్తారు.

ఇది ప్రతి సంవత్సరం పవిత్రమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో( Varanasi ) నిర్వహిస్తారు.అలాగే దేవ్ దీపావళి కార్తీక పూర్ణిమ రోజున వస్తుంది.

ఈ వేడుకలు కార్తీక శుక్ల పక్షం యొక్క ఏకాదశి తిథిలో మొదలవుతాయి.ఐదవ రోజున ముగుస్తాయి.

ఈ ప్రత్యేకమైన రోజున త్రిపురాసురుడు అనే రాక్షసునిపై పరమశివుడు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు.

Telugu Bhakti, Dev Diwali, Devdiwali, Devotional, Ganga Bath, Ganga River, Lord

వారణాసిలో దేవ్ దీపావళి ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.వారణాసి నగరం ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.ఎందుకంటే ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా పవిత్ర గంగా నదిలో( Ganga River ) స్నానం చేయడానికి దేవతలు భూమికి దిగివస్తారని చాలా మంది నమ్ముతారు.

వారణాసిలో దేవ్ దీపావళి వేడుకలు నగరం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వంలో కలిసి ఉన్నాయి.ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని, చీకటిపై కాంతి యొక్క దైవత్వాన్ని మరియు మానవత్వం మరియు దైవికం మధ్య పవిత్ర సంబంధాన్ని సూచిస్తుంది.

Telugu Bhakti, Dev Diwali, Devdiwali, Devotional, Ganga Bath, Ganga River, Lord

కార్తీక పూర్ణిమ యొక్క పవిత్రమైన రోజున, భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానం( Sacred Bath ) చేస్తారు.దేవ్ దీపావళి రోజు మట్టి దీపాలను వెలిగిస్తారు.సాయంత్రం సమయంలో గంగా నది ఒడ్డున ఉన్న అన్ని ఘాట్‌ల మెట్లపై లక్షలాది మట్టి దీపాలను వెలిగిస్తారు.ఈ పవిత్రమైన పండుగను దేవ్ దీపావళి అని అంటారు.

ఎందుకంటే శివుడు( Lord Shiva ) త్రిపురాసురుడు అనే రాక్షసుడిని ఓడించిన తర్వాత ఈ రోజున దేవతలు దీపావళిని జరుపుకుంటారు.దేవ్ దీపావళి రోజు భక్తులు గంగా పవిత్ర జలంలో స్నానం చేయడానికి, సాయంత్రం దీపాలను వెలిగించడానికి మరియు శివుడిని ఆరాధించడానికి సూర్యో సమయానికి ముందే మేల్కొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube