ఉత్తర కర్ణాటక( Karnataka )లోని గోకర్ణ పుణ్యక్షేత్రంలో కొలువైన స్మశాన కాళి ఆలయానికి ఎంతో ప్రత్యేక చరిత్ర ఉంది.ఈ ఆలయం త్రేతా యుగం కాలం నాటిదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
భద్రకాళి, రుద్రకాళి మరియు స్మశాన కాళీ ముగ్గురు చాలా శక్తివంతమైన దేవతలు అని పూజారులు చెబుతున్నారు.ముఖ్యంగా స్మశాన కాళి తంత్ర దేవత అని చెబుతున్నారు.
శివుడి కంటే శక్తివంతమైన ఈ జగత్తు మాత తన ఎడమ కాలును శివునిపై ఉంచి,కుడి చేతిలో ఖడ్గన్ని పట్టుకొని ఆర్భాటాన్ని అర్పిస్తూ తిరిగే రక్షకులు అని చెబుతున్నారు.మహాబలా సన్నిధి నుంచి ఒక కిలో మీటర్ దూరంలో ఉన్న స్మశాన వాటిక పక్కనే ఈ దేవాలయం ఉంటుంది.
ఈ దేవాలయం లోపల రుద్ర కాళి, స్మశాన కాళి, వినాయక( Vinayaka ), నాగ విగ్రహాలు ఉంటాయి.అలాగే ఇక్కడ నిలబడి దేవతను ఏమైనా కోరిక కోరితే తప్పకుండా నెరవేరుతుందని భక్తులు చెబుతున్నారు.స్థల పురాణం ప్రకారం ప్రపంచంలోని దేవతలందరి కంటే స్మశాన కాళి ఉనికి చాలా రహస్యమైనదని చెబుతున్నారు.అదే సమయంలో భయంకరమైనదిగా అని కూడా చెబుతున్నారు.స్మశాన కాళి అమ్మవారు గాడిదలు మరియు తోడేళ్ల పై స్వారీ చేసే వారిని,అలాగే నాలిక బయటపెట్టి, జుట్టు విరబోసుకొని గుండ్రని ఎర్రని కళ్లతో నాట్యం చేస్తున్నట్లు ఉంటుందని చెబుతున్నారు.అలాగే రాక్షసుల పుర్రెలను మాలగా ధరించారని చెబుతున్నారు.
ఇక అమ్మవారికి పది చేతులు ఉంటాయని కూడా చెబుతున్నారు.అలాగే ఈ దేవాలయంలో ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.ఒక వైపు చితి మండుతుంటే మరోవైపు దేవాలయంలో పూజలు చేసే పద్ధతి మన దేశంలో కేవలం రెండు దేవాలయాలలో మాత్రమే ఉంది.అందులో మొదటిది కాశి కాగా రెండవది గోకర్ణ పుణ్యక్షేత్రం( Gokarna )లో కొలువైన స్మశాన కాళి దేవాలయంలోనే అనే ప్రజలు చెబుతున్నారు.
మహాబలేశ్వర్ సన్నిధానం నుంచి కేవలం ఆర కిలోమీటర్ దూరం నడవడం ద్వారా ఈ అమ్మవారినీ దర్శనం చేసుకోవచ్చు.
DEVOTIONAL