భక్తిశ్రద్ధలతో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలు..

స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం దంపతులతో సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలను వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మలపెంట వెంకటరమణ దేవాలయ పూజారి గౌరీ పెద్ది హరిశర్మలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

 Sri Veera Venkata Satyanarayana Swamy Vratam With Devotion Details, Sri Veera Ve-TeluguStop.com

అన్నవరం దేవస్థానం నుంచి తెచ్చిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రతిమలతో అమ్మవారి సమక్షంలో దంపతులు భక్తిశ్రద్ధలతో వ్రతాలు చేశారు.మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా మార్కాపురం పట్టణ శివారు ప్రాంతాలలో వెలసిన శ్రీ అల్లూరి పోలేరమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు.అమ్మవారి మూలవిరాట్ కు వివిధ పుష్ప మాలలు నిమ్మకాయ తండాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

విశేష పూజలు అమ్మవారికి అర్చకులు నిర్వహించారు.భక్తులు అమ్మ వారిని దర్శించుకుని చీరలు, గాజులు, పసుపు రంగు సమర్పించారు.

ఈఓ ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది వెన్న శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పరిరక్షించారు.

Telugu Markapuram, Pooja, Saibaba, Srialluri, Sriveera, Vasavikanyaka-Latest New

ఇంకా చెప్పాలంటే స్థానిక ఎన్ఎస్ పి కాలనీలో సాయిబాబా దేవాలయ 24వ వార్షికోత్సవం ఆదివారం ఎంతో ఘనంగా, వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా అర్చకులు రామ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు.అనంతరం కాకడ హారతి, గణపతి పూజ, అభిషేకం, అర్చన, పాదపూజ, విష్ణు సహస్రనామ పారాయణం, సాయి చాలీసా, పారాయణము, మధ్యాహ్న హారతి, ప్రసాదం వితరణ నిర్వహించారు.

Telugu Markapuram, Pooja, Saibaba, Srialluri, Sriveera, Vasavikanyaka-Latest New

ఆ తర్వాత సాయంత్రం అంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరిగింది.కార్యక్రమంలో కమిటీ పెద్దలు, మహిళా భక్తులు కూడా పాల్గొన్నారు.అంతేకాకుండా స్థానిక శివాలయంలో మాఘ శుద్ధ పౌర్ణమిని జరుపుకొని ఆదివారం ప్రత్యేక పూజలను చేశారు.శివదీక్ష చేపట్టిన కన్నే స్వాములతో అమ్మవారి కలశ పూజలు చేశారు.నంది వాహనం పై శివ పార్వతులకు విళక్కి మహోత్సవం నిర్వహించారు.దేవాలయ చైర్మన్‌ వీ.కేశవరావు, ఈవో ఈదుల చెన్నకేశవ రెడ్డి ధర్మకర్తలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube