ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.48
సూర్యాస్తమయం: సాయంత్రం.6.13
రాహుకాలం: సా.3.00 ల4.30
అమృత ఘడియలు: సా.4.22 ల5.22
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా.10.46 ల11.36
మేషం:

ఈరోజు కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి.నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి.ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ కలిగిస్తాయి.
ధన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.
వృషభం:

ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.దూరప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.పాత ఋణాలు కొంత వరకు తీర్చగలుగుతారు.ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు.
మిథునం:

ఈరోజు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు.మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.
ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఇంటా బయట బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి.ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు.
కర్కాటకం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.
సింహం:

ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు.
కన్య:

ఈరోజు చేపట్టిన పనులు మందగిస్తాయి.కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.దూరప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి.
కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు.వ్యాపారాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల:

ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.పనులు మధ్యలోనే ఆగిపోతాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్త ఉండాలి.కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
ధనుస్సు:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారం మొదలు పెట్టే వాళ్లకు మంచి విజయం ఉంటుంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.
మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.పెద్దవారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుంభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులలో అదృష్టం కలిసి వస్తుంది.ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.
మీనం:

ఈరోజు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది.
భూ సంభందిత క్రయ విక్రయాలు కలసివస్తాయి.వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.