Shiva Parvati : బ్రహ్మ పురోహితుడుగా మారి.. శివపార్వతుల వివాహం జరిపించిన ఆలయం ఎక్కడో తెలుసా..?

శివపార్వతులను( Shiva Parvati ) ఆదిదంపతులు అని అంటారు.అలాంటి ఆది దంపతుల వివాహం ఎక్కడ జరిగిందో తెలుసా? ఉత్తరాఖండ్లను రుద్రప్రయాగా త్రియుగినారాయణ ఆలయంలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.అయితే పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ( Brahma ) దగ్గర నుండి శివపుత్రుడు తప్ప మరి ఎవరి చేతిలో మరణం సంభవించకూడదని వరం తీసుకుంటాడు.వర గర్వంతో ముల్లోకాలని ముప్పతిప్పలు పెడుతూ దేవతలని కూడా హింసిస్తూ ఉంటాడు.

 Do You Know The Temple Where Brahma Became A Priest And Got Married To Shiva Pa-TeluguStop.com

అదే సమయంలో సతీదేవి వియోగంతో శివుడు ఆమె దేహాన్ని భుజం మీద పెట్టుకొని తాండవం ఆడుతూ లోక సంరక్షణ మర్చిపోతాడు.

Telugu Bakthi, Brahma, Shiva Parvati-Latest News - Telugu

తన కర్తవ్యం గుర్తు చేయడం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండ, ఖండాలుగా చేస్తాడు.ఒక్కో శరీర భాగం పడిన ప్రదేశమే శక్తి పీఠాలుగా విరుజిల్లుతాయి.తారకాసురుడు నుండి విముక్తి కలగాలంటే శివపార్వతుల వివాహం జరిపించాలని దేవతలు నిశ్చయించుకుంటారు.

అప్పటికే శివుడిని మనువాడాలనే కోరికతో పార్వతీదేవి ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తూ ఉంటుంది.ఆమె అంచచలమైన భక్తి, తపస్సుకి మెచ్చిన శివుడు త్రియుగినారాయణ ఆలయంలో పార్వతీ దేవిని వివాహమాడాడని శివపురాణం చెబుతోంది.

Telugu Bakthi, Brahma, Shiva Parvati-Latest News - Telugu

అయితే ఈ పవిత్రమైన హోమం ఏర్పాటు చేసి పెళ్లి జరిపించారు.అయితే స్వయంగా బ్రహ్మ, విష్ణువు ఈ వివాహం జరిపించారని పురాణాలు చెబుతున్నాయి.శివపార్వతుల వివాహంలో విష్ణుమూర్తి కీలక పాత్ర పోషించారు.అయితే శివపార్వతుల వివాహానికి బ్రహ్మ పురోహితుడిగా మారి వివాహాన్ని జరిపిస్తారు.ఆ తర్వాత ఈ దైవిక జంటను ఆశీర్వదిస్తాడు.అయితే వివాహం జరిపించటానికి ముందు ఆలయం లోపల ఉన్న బ్రహ్మ కుండ్ లో స్నానం ఆచరిస్తాడు.

అందుకే ఆ ప్రదేశానికి బ్రహ్మ కుండ్ అనే పేరు వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube