సూర్యోదయం సమయంలో నిద్ర లేవమని పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా..?

కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా నిద్రపోయే సమయం మేల్కొనే సమయంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి.ఇప్పటికంటే రెండు, మూడు తరాల ముందు పెద్దవారు తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర లేచి సాయంత్రం ఏడు గంటల సమయంలోనే నిద్రపోయేవారు.అయితే మారిన కాలంలో భాగంగా ఆలోచనలు అలవాట్లలో వచ్చిన మార్పులతో నిద్రపోయే సమయం నిద్రలేచే సమయంలో మార్పులు వచ్చాయి అందుకనే నేటి తరం వారు ఉదయం మంచి నిద్ర పొందే సమయంగా భావిస్తున్నారు.

 Do You Know Why Adults Tell Us To Wake Up At Sunrise? , Sunrise, Lord Surya ,-TeluguStop.com

https://telugustop.com/wp-content/uploads/2023/07/sunrise-devotional-wake-up-LORD-SURYA-Brahma-Muhurta-Body-mind-problems.jpg

Telugu Bhakti, Brahma Muhurta, Devotional, Lord Surya, Sunrise-Latest News - Tel

అలాంటి ఆనందాన్ని త్వరగా నిద్ర లేచి పోగొట్టుకోవడం మూర్ఖత్వం కదా అని భావిస్తూ ఉన్నారు.అయితే సూర్యోదయం అయిన తర్వాత కూడా మీరు ప్రశాంతంగా నిద్రపోతే ఏమి జరుగుతుంది.త్వరగా నిద్ర లేవాలి అని భారతీయులు ఎందుకు చెప్పారు? అందులోని నిజ నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సూర్యనారాయణ మూర్తి( Lord surya )ని ప్రత్యక్ష దైవంగా భావించి పూజిస్తారు.ప్రపంచానికి చీకటిని పారద్రోళి వెలుగును అందించేవాడు సూర్యుడు.అందరికీ ఉత్సాహాన్ని తేజస్సును అందించే సూర్య భగవానుడు భూమిని తాగేవేళ ఆయనకు స్వాగతం పలకడానికి మనం సిద్ధపడాలి.సూర్యోదయ సమయం( Sunrise )లో సూర్య భగవానుడికి నమస్కారం చేస్తూ అర్ఘ్యం సమర్పించడం ఎంతో మంచిది.

శరీర మానసిక సమస్యలు దూరం అవుతాయని ప్రజలు నమ్ముతారు.ముఖ్యంగా చెప్పాలంటే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం పూర్తి చేసుకుని స్వచ్ఛమైన మనసుతో సూర్య భగవానుడికి నమస్కరించాలి.

Telugu Bhakti, Brahma Muhurta, Devotional, Lord Surya, Sunrise-Latest News - Tel

సంవత్సరం పొడుగునా సూర్యకిరణాలు తాగితే శరీరం ఆత్మ ఉత్సాహాన్ని పొందుతుంది.సూర్యదయానికి ముందు నిద్రలేవాలి అని పెద్దలు చెప్పడంలో ఇదొక కారణం.అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది.ఉదయాన్నే నిద్ర లేచి ఏమి చేయాలో మీరే ప్రశ్నించుకోవాలి.రోజు ఎలా జరుగుతుందని చింతించకుండా ఈరోజు నేను ఏమి చేయాలి అనేది ముందే నిర్ణయించుకోవాలి.సూర్యోదయం తర్వాత పనులు ప్రారంభించాలి.

సమయాన్ని వినియోగించడం మనిషి కర్తవ్యం.అందుకే బ్రాహ్మీ ముహూర్తం ఉత్తిష్ఠేత్ స్వస్థో రక్షార్థం ఆయుష: తత్ర సర్వార్థ శాంత్యర్థం స్మరేచ్చ మధుసూదనం అన్నారు పెద్దలు.అంటే బ్రహ్మ ముహూర్తం( Brahma Muhurta )లో నిద్ర లేవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, రోగాలను దూరం చేస్తుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube