మెగా ఫ్యాన్స్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఫ్యాన్స్ జులై 28 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej )కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్”.
ఈ సినిమా మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.అందుకే ఈ సినిమాపై మేకర్స్ భారీ అంచనాలను క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే వచ్చిన టీజర్ బాగా ఆకట్టుకుని అంచనాలను పెంచేసింది.అయితే పాటలు మాత్రం ఇందుకు భిన్నంగా అస్సలు ఆకట్టుకోలేక పోయాయి.జులై 21న ట్రైలర్ రిలీజ్ కానుంది.అందుకోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో పవన్ కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.మొత్తం ఈయన సినిమా కాకపోయినా ఎప్పుడు చేయనంత బిజినెస్ చేస్తున్నట్టు టాక్.
మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్( Trivikram Srinivas ) మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కించారు.ఇప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటూ రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా మాసివ్ రెస్పాన్స్ లభిస్తుంది.అలాగే నైజాం లో కూడా ఈ సినిమా ఎలాంటి బాగానే బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే ఇప్పుడు బ్రో సినిమాకు అసలు చిక్కు ఏపీ లోనే వచ్చినట్టు తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ సినిమాకు ఎప్పుడు లేనంత టెన్షన్ ఈ సినిమా రిలీజ్ విషయంలో నెలకొంది.దీంతో బ్రో రిలీజ్ అయ్యే వరకు బిజినెస్ ఎంత.టికెట్స్ రేట్స్ ఏంటి అనే విషయాలు బయటకు వచ్చేలా లేవు.చూడాలి మరి పరిస్థితి ఎలా ఉంటుందో.కాగా ప్రియా ప్రకాష్ వారియర్,( Priya Prakash Varrier ) కేతిక శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
కాగా ఈ సినిమా జులై 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.