ముఖ్యంగా చెప్పాలంటే మనదేశంలో దాదాపు చాలామంది ప్రజలు చిన్న పండుగ నుంచి పెద్ద పండుగ వరకు ఎన్నో సంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటారు.మహేశ నవమి రోజున( Mahesh Navami ) శివ పార్వతులను ఆరాధించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
ఇంకా చెప్పాలంటే శివుని దయతో మహేశ్వరి నవమి రోజున ఉద్భవించింది.మహేష నవామి రోజు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.
అలాగే పూజా విధానం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే మహేష నవమి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో ఈ రోజునా గంగా నదిలో లేదా గంగా జలంతో స్నానం చేసి మహా శివున్ని స్మరించుకోవాలి.అలాగే స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ఎంతో మంచిది.మహేష నవమి రోజు శివుడు తల్లి పార్వతి( Parvati )ని పూజించడానికి పండ్లు, పువ్వులు, ధూపం, దీపం, పాలు, పెరుగు మొదలైన వాటిని తీసుకోవాలి.
అంతే కాకుండా ఈ సమయంలో శివుని మంత్రులను జపించాలి.శివ పంచాక్షర పారాయణం చేయడం ఎంతో శుభంగా పండితులు చెబుతూ ఉంటారు.శివ లింగానికి అభిషేకం( Shiva lingam ) చేయడం వల్ల మన జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి అని కూడా పండితులు చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ఉపవాసం ఉన్న వారు సాయంత్రం హారతి తర్వాత ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది.
ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సంతానం కలగాలనే భక్తుల కోరికలు నెరవేరుతాయి.మహేష నవమి రోజు చేసే పూజా పిల్లల్లో సంతోషాన్ని, దాంపత్య జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది.