విభూతిని నీటితో తడిపి నుదుటి మీద మూడు రేఖలు ఒక దాని కొకటి తగులకుండా, విడి విడిగా అడ్డంగా పెట్టుకోవడాన్ని త్రిపుండ్ర ధారణ మంటారు.తిరుమణితో వైష్ణవులు మూడు గీతలు నుదుటి మీద నిలువుగా పెట్టుకుంటే దానిని సంప్రదాయికి చెందిన ద్వైత స్వీపుండ్రం అంటారు.
అలాగే మధ్వాచార్య గోపీ చందనాన్ని ధరించి దాని మధ్యలో అంగారాన్ని ధరిస్తారు.ఇక, విభూతిని ధరించేటప్పుడు కుడి చేతితో విభూతి తీసుకుని ఎడమ చేతిలో పోసుకుని దానిని తడిపి, “ఓం అగ్ని రితి భస్మ, ఓం వాయురితి భస్మ, ఓం ఖిమితి భస్మ, ఓం జలమితి భస్మ, ఓం స్థలమితి భస్మ.
ఓం వ్యోమేతి భస్మ.ఓం సర్వగ్ హవా ఇదం భస్మ.
ఓం మనపి తాని చక్షుంసి భస్మానీతి” అన్న మంత్రంతో ఏడు మార్లు అభిమంత్రించాలి.
తరువాత “ఓం త్ర్యాయుషం జమదగ్నేరితి శిరసి (తల మీద) ఓం కశ్యపస్య త్రాయుషం ఇతి లలాటే (నొసలు) ఓం యద్దేవానాం త్రాయుషం ఇతి వక్షస్థలే (రొమ్ము) ఓంతన్మే అస్తు త్ర్యాయుషం ఇతి స్కంథేషు (భుజముల మీద) అని ఆయా చోట్ల మూడు రేఖలుగా ధరించాలి.
అట్లే వైష్ణవులు చేసే ఊర్థ్వ పుండ్ర ధారణ సమయంలో కేశాది నామాలను స్మరిస్తూ ధరించాలి.లేదా స్మృతే సకల కళ్యాణ, భాజనం యత్ర జాయతే పురుషత మం నిత్యం ప్రజామి శరణం హరిమ్” అంటూ హరిని స్మరిస్తూ ధరించాలి.
ఇలా ధరించడం వల్ల చాలా లాభాలు కల్గుతాయని వేద పండితులు చెబుతున్నారు.