ఈ మధ్యకాలంలో ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందడానికి అధిక సంఖ్యలో ఎయిర్ కండిషనర్( Air conditioner ) లను ఉపయోగిస్తున్నారు.వాస్తవానికి వర్షంలో శరీరంలోని చెమట సులభంగా ఆరి పోదు.
దీంతో అనేక చర్మ వ్యాధుల( Skin diseases ) ప్రమాదం కూడా పెరుగుతుంది.వర్షాకాలంలో తేమ పెరుగుతుంది.
తేమతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఫ్యాన్లు, కూలర్ల నుండి ఉపశమనం పొందలేరు.ఇలాంటి పరిస్థితులలోనే చాలామంది ఏసీ ని వినియోగిస్తూ ఉంటారు.
అయితే వర్షాకాలంలో ఏసీ ఉష్ణోగ్రత ఎలా ఉండాలి? ఎప్పుడు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనే సందేహం ప్రతి ఒక్కరికి తలెత్తుతుంది.

వర్షంలో తేమ ఎక్కువగా ఉంటే ఏసీ </em( AC )ని ఉపయోగించుకోవచ్చు.తేనె ఎక్కువగా కనిపిస్తే ఏసీ యొక్క డ్రైమోడ్ ను ఉపయోగించుకోవాలి.కానీ ఎక్కువ సేపు దీన్ని చేయవద్దు.
సాధారణంగా ఏసీ యొక్క ఉష్ణోగ్రత 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి.ఇక రాత్రి సమయంలో ఏసీ ని ఉపయోగించుకోవచ్చు.
కానీ ఏసీ యొక్క అధిక వినియోగం మాత్రం హానికరం.ఏసీ ని ఎక్కువగా రన్ చేయడం వలన చర్మం లోని తేమని పోగొట్టుకోవడంతోపాటు పొడిబారిన చర్మం సమస్య కూడా వస్తుంది.
అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఏసీ ఉపయోగించడానికి ప్రయత్నించాలి.

ఏసీని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువగా వాడడం వలన జలుబు, ఫ్లూ సమస్యలు ( Cold and flu problems )వస్తాయి.ఇక చాలామంది వర్షాకాలంలో తడిసిపోయి వచ్చి ఏసీ ఆన్ చేసి ఆరబెట్టడం చేస్తారు.అయితే ఇలా చేయడం చాలా హానికరం.
వర్షంలో తడిసిన తర్వాత ఎప్పటికీ శుభ్రమైన నీటితో స్నానం చేయాలి.ఇక ఆ తర్వాత శరీరం అంతా మాయిశ్చరైజర్ ను పూయాలి.
ఈ వర్షాకాలంలో చెమట, ధూళి కారణంగా చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ ( Fungal infection )వచ్చే అవకాశాలు ఉన్నాయి.వర్షంలో ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.
నీటిని త్రాగడంలో కూడా చాలా పరిశుభ్రతను పాటించాలి.అప్పుడే ఈ సీజన్లో రోగాలు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.