వందేళ్లు దాటిన ఆంధ్ర యువకుడు.. అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు సిద్ధం..!

సాధారణంగా వందేళ్లు పైబడిన వ్యక్తులు ఇంట్లో ఉంటే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.ఏవో కొన్ని రోగాలతో పాటు నడవడానికి, కూర్చోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.

 Andhra Youth Who Has Crossed 100 Years Is Ready For International Athletics Comp-TeluguStop.com

ప్రస్తుత కాలంలో కేవలం 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులే తమ పనులు తాము చేసుకోలేకపోతున్న రోజులువి.దీనికి పర్యావరణంలో ఉండే గాలి, నీరు తో పాటు ఆహారపు అలవాట్లే కారణం.

అలాంటిది ఈరోజుల్లో ఏకంగా 101 ఏళ్ల వృద్ధుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఏకంగా రోజుకు 12 కిలోమీటర్లు నడుస్తున్నాడు.ఈయన ఏకంగా విదేశాల్లో జరిగే అథ్లెటిక్ పోటీలకు( athletic competitions ) సిద్ధమవుతున్నాడు.

ఆయనకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Andhra, Asianmasters, Athletics, Krishna, Latest Telugu, Machilipatnam, S

కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన వి.శ్రీరాములు( V.sriramulu ) (101).ఆరోగ్యంగా ఉండి ఈ ఏడాది నవంబర్ 8 నుంచి 12 వరకు ఫిలిపిన్స్ లో జరగబోయే ఏసియన్ మాస్టర్స్ అథ్లెటిక్ కాంపిటీషన్( Asian Masters Athletic Competition ) కు సిద్ధమవుతున్నాడు.వచ్చే ఏడాది జూన్లో స్వీడన్ లో జరగబోయే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2024లో కూడా పాల్గొననున్నాడు.

ఇప్పటికే వి.శ్రీరాములు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రేస్ వాయింగ్ పోటీల్లో 9 బంగారు, 5 రజత, 2 కాంస్య పతకాలు సాధించాడు.శ్రీరాములు 1923 జూలై 18న ఓ మధ్య తరగతి లో జన్మించాడు.చదువు పూర్తయిన అనంతరం అప్పటి రాయల్ ఇండియన్ నేవీలో చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహించాడు.1979 డిసెంబర్ 31న కమాండర్ హోదాలో పదవీ విరమణ చేశారు.ఆ తరువాత క్రీడలపై ఆసక్తితో రేస్ వాయింగ్, రన్నింగ్, షాట్ పుట్, డిస్కస్ లాంటి ఆటలు ఆడుతూ అందరిని ఆశ్చర్యపరిచాడు.

Telugu Andhra, Asianmasters, Athletics, Krishna, Latest Telugu, Machilipatnam, S

శ్రీరాములు కు క్రీడలతో పాటు పర్వతారోహణం అంటే కూడా ఎంతో ఇష్టం.2002లో తన కుమారుడితో కలిసి ఆఫ్రికాలోని కిలిమంజారో, తనకు 81 ఏళ్లు ఉన్నప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంపు, 83వ ఏట హిమాలయాలలోని పిండారీ గ్లేసియర్లను అధిరోహించాడు.ఇంత వయసులో కూడా శ్రీరాములు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏమిటంటే.దాదాపుగా 50 ఏళ్ల నుండి ప్రతిరోజు 12 కిలోమీటర్ల నడక, ఉదయం మొలకల చట్నీతో బ్రెడ్ టోస్ట్, కాఫీ.

మధ్యాహ్నం పెరుగన్నం.సాయంత్రం ఒక కప్పు మజ్జిగ.

రాత్రి ఏమి తినకుండా ఎనిమిది గంటల వరకు నిద్ర.ఇది ఆయన ప్రతిరోజు దినచర్య.

మంచి ఆరోగ్యం కోసం తక్కువ ఆహారం ఎక్కువ వ్యాయామం చేయాలని చెప్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube