తిరుమల శ్రీవారి హుండీ గురించి చాలామందికి తెలియని 11 ఆసక్తికర విషయాలివే.! ఎప్పటినుండి మొదలైందంటే.?

తిరుమ‌ల శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి వారి ఆల‌యం.ఈ ఆల‌యం గురించి తెలియ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి లేదు.

 Eleven Unknown Facts About Tirumala Hundi-TeluguStop.com

దేశ‌వ్యాప్తంగానే కాదు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంత‌టి గుర్తింపు పొందింది ఈ ఆల‌యం.ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య రోజూ వేల‌ల్లో ఉంటుంది.

ఇక ప్ర‌త్యేక పూజ‌లు, ఉత్స‌వాలు జ‌రిగిన‌ప్పుడు అయితే ఆ సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది.శ్రీవారికి కానుకల రూపంలో నిత్యం లక్షలాది నోట్ల కట్టలు, ఖరీదైన బంగారు, వెండి నగలు వస్తాయి.

ఇక పండుగలు, విశేషదినాల్లో ఏడుకొండల వేంకటేశునికి లెక్కకు మిక్కిలిగా కానుకలు వస్తాయి.శ్రీవారి హుండీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము.

1.శంఖుచక్రాలు, తిరునామాలు ముద్రించిన రాగి గంగాళాన్ని శ్రీవారి హుండీగా ఉపయోగిస్తారు.దీన్ని కొప్పెర అని కూడా అంటారు.

2.బంగారు నగలు, వెండి పాత్రలు, ముడుపులు, నాణేలు, నోట్లు, వస్త్రాలు, కర్పూరం, బియ్యం ఇలా ఎన్నో రకాలైన వస్తువులను భక్తులు స్వామివారికి కానుకలుగా ఈ హుండీ ద్వారా సమర్పిస్తారు.నిటారుగా పెద్ద సంచీ ఆకృతితో ఏర్పాటు చేయబడిన తెల్లని కాన్వాసు గుడ్డలో పెద్ద రాగి గంగాళాన్ని దించి పైగుడ్డను రోటి వలె తాళ్ళతో కట్టి వేలాడదీస్తారు.

ఈ కాన్వాసు గుడ్డపై శ్రీవారి శంఖుచక్రాలు తిరునామాలు చిత్రింపబడి ఉన్నాయి.

3.భక్తులు వేసే కానుకలు భద్రంగా సరాసరి గంగాళంతో పడేటట్లుగా ఏర్పాటు చేయబడిన ఈ బుర్కాగంగాళాన్ని కొప్పెర అని అందుకే అంటారు.

4.1821 జూలై 25న శ్రీవారి హుండీ ఏర్పాటైంది.ఈస్టిండియా కంపెనీవారి చట్టం బ్రూస్కోడ్- 12లో దీని వివరాలు ఉన్నాయి.

5.1830ల్లోనే తిరుమల ఆదాయం, అందులోనూ ప్రధానంగా హుండీ ఆదాయం నుంచి పూజలకు, అర్చనలకు, ఉత్సవాలకు ఖర్చులు పోగా ఆనాటి ప్రభుత్వమైన ఈస్టిండియా కంపెనీకి దాదాపు రూ.లక్ష మిగులు ఉండేది.ఇక ప్రస్తుతం శ్రీవారి ఒకరోజు సగటు ఆదాయం కోటిన్నరకు పైగా ఉంది.

6.ఈ హుండీ గుడ్డపై గల తాళ్లపైన దేవస్థానం వారి సీళ్ళు ఏడు, అలాగే జియ్యంగార్ల సీళ్ళు ఆరు లక్కతో వేస్తారు.ఈ హుండీని ఏర్పాటు చేసినప్పుడు పరకామణి నిమిత్తం విప్పేటప్పుడు అధికారులు ఈ సీళ్ళు సరిగా ఉన్నది లేనిదీ తనిఖీ చేస్తారు.

7.పురాణాల ప్రకారం, శ్రీనివాసుడు పద్మావతిదేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బులేకుంటే పెళ్ళిఖర్చుల కోసం ఇక్కట్లు పడ్డాడు.లక్ష్మిదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయనకు సంపదలేకపోయింది.

పెళ్ళికి అవసరమైన డబ్బు కుబేరుడు వేంకటేశ్వరునికి అప్పుపెట్టారు.వేంకటేశ్వరస్వామి ఆ బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు.

ఆ వడ్డీ డబ్బును ఈ హుండీ సొమ్ములోంచే ఇస్తున్నాడని ప్రతీతి.

8.ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆ స్వామి తీరుస్తాడని నమ్మిక.ఇక ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారం, సొమ్ముతో పళంగా పర్సు మొత్తం హుండీలో వేసేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు.

9.హుండీకి సాక్ష్యంగా ఇద్దరు యాత్రికులు కూడా ఉంటారు.హుండీని రోజుకు రెండుసార్లు అనగా మధ్యాహ్నం రెండవ నైవేధ్య కాలంలో 12 గంటల సమయంలోను, మళ్ళీ రాత్రి ఏకాంతసేవా సమయంలోను విప్పదీస్తారు.మరీ యాత్రిక జనసమ్మర్థం విపరీతంగా ఉంటూ కానుకలు ఎక్కువైన సమయంలో హుండీని రోజుకు మూడునాలుగు సార్లు కూడా తీయడం జరుగుతుంది.

10.వేంకటేశ్వరుడి అకౌంటు కింద వివిధ బ్యాంకుల్లో 9,500 కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.వాటి ద్వారా దేవస్థానానికి ఏడాదికి 800 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది.ఇక సాధారణ రోజుల్లో రోజుకు రూ.కోటి నుంచి రూ.2.5 కోట్ల ఆదాయం శ్రీవారికి వస్తుంది.అదే రద్దీ రోజులో అయితే రోజుకు రూ.2.50 నుంచి రూ.3 కోట్లు దాటుతుంది.

11.హుండీని ఏర్పాటు చేసిన ఈ స్థలంలో జగద్గురువులన శ్రీ మచ్చంకర భవత్పాదుల వారు శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని అందువల్లే అపరిమితమైన సంపద అసంఖ్యాకంగా ద్రవ్యారాశి ఆకర్షింపబడి ఈ హుండీ లోనికి చేరుతున్నదని పరంపరగా వినవస్తున్న గాథ అని పెద్దల మాట.ఇది సత్యమే.ఈ హుండీ క్రమంగా క్రిందుగా శ్రీ చక్రమున్నట్లుగా ప్రత్యక్షంగా దర్శించిన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు శ్రీ రామనాథ ఘనాపాటి ఈ రచయితతో చెప్పారు.సుమారు 70 యేళ్ళ క్రితం తాను వేదవిద్యార్థిగా ఉన్నప్పుడు ఆలయ అధికారులు నేలను ఎత్తు పెంచడానికి హుండీ ఉన్న స్థలాన్ని త్రవ్వి చూడగా శ్రీ చక్ర యంత్రం స్పష్టంగా గోచరించిందన్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube