మనం తల పెట్టిన ఏ పనిలో కూడా విజయం సాధించలేకపోతే కొన్ని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు.కానీ మన జనరేషన్ లో ఎవరు వినట్లేదు కానీ, ఇలాంటి చిన్న చిన్న పనులకు దూరంగా ఉంటే ఈ పేదరిక ఛాయలు( Poverty ) దగ్గరకు రావు.
మరి ఆ చిన్న చిన్న పనులు ఎమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం( Wakeup Late ) పేదరికానికి ఒక ముఖ్య కారణం అని పండితులు చెబుతున్నారు.
సైంటిఫిక్ గా చెప్పాలంటే ఉదయం లేటుగా లేచే వారు లేజీగా ఉంటారు.ఇక ఇతరుల ఆస్తుల పై ఆశపడే వారు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోలేరని పండితులు చెబుతున్నారు.
మనది కానిది మనం తీసుకుంటే మనకు సొంతం కావాల్సింది, మనకు చెందకుండా పోతుంది.అంతే కాకుండా అకారణంగా నిత్యం కోపం( Anger ) ప్రదర్శించే వారు కూడా పేదరికాన్ని కచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది.అలాగే విరిగిన పాత్రల లో భోజనం చేసే వారిని కూడా పేదరికం వెంటాడుతూనే ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఇలా చేసే వారి పై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
అలాగే చాలా మంది మురికి బట్టలు( Dirty Clothes ) వేసుకుంటూ ఉంటారు.దీని వలన ఆరోగ్యం నశిస్తుంది.
ఇది కూడా ఒక రకమైన దరిద్రం అని చెప్పవచ్చు.కాబట్టి ఎప్పటికీ కూడా ఒక్కసారి ఒంటి పైన ధరించి వదిలేసిన దుస్తులను మరోసారి శరీరం పై ధరించకూడదు.దీని వలన ఇంతకు ముందు శరీరం పై ఉన్న బ్యాక్టీరియా అంతా ఆ దుస్తుల పైకీ చేరుకుని ఉంటుంది.అది మళ్లీ శుభ్రమైన శరీరంపై ధరించడంతో బ్యాక్టీరియా వ్యాపించి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.
అనారోగ్య సమస్యలు అంటే దరిద్రం అనీ అర్థం.కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ అలవాట్లను దూరం చేసుకుంటే దరిద్రాన్ని, పేదరికాన్ని దూరం చేసుకోవచ్చు.
ఈ అలవాట్లను దూరం చేసుకుని వీటికి భిన్నంగా ఉండే మంచి అలవాట్లను చేసుకుంటే మన జీవితంలో నుండి సమస్యలు దరిద్రం తొలగిపోయి మన జీవితం ఆనందంగా మారుతుంది.