రామా అనే పదం రెండు అక్షరాలు కావచ్చు.కానీ ఈ పదంలో ఎంతో శక్తి నిండి ఉంటుంది.
రామనామం జపించడం వల్ల అంతా శుభమే జరుగుతుంది అని వేద పండితులు చెబుతూ ఉంటారు.ఏకపత్నీవ్రతుడిగా, ధర్మానికి ప్రతిరూపంగా శ్రీరాముడిని ప్రజలందరూ ఎంతో భక్తితో కొలుస్తారు.
అయితే ప్రతి సంవత్సరం శుక్లపక్షం లేదా చైత్ర నవరాత్రులలో 9వ రోజున శ్రీరామ నవమిని( Sri Rama Navamini ) జరుపుకుంటారు.ఎందుకంటే ఈ ఆజానబావుడు ఈ రోజునే జన్మించాడు.
హిందూమతంలో అత్యంత పవిత్రమైన పండుగలో శ్రీరామనవమి ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.పెద్ద పండుగ కాబట్టి ఈ పండుగను రామ నవరాత్రులు అని కూడా పిలుస్తారు.
అయితే చాలా మంది శ్రీరామ నవమి వేడుకలను దేవాలయాల్లోనే జరుపుకుంటారు.కొంతమంది శ్రీరామనవమి వేడుకలను ఇంట్లోనే జరుపుకుంటారు.
మరి ఇంట్లో శ్రీరామనవమి వేడుకలను ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.ఆ రోజు ఉదయం నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
గడపకు పసుపు కుంకుమ రాయాలి.తర్వాత తల స్నానం చేసి పసుపు రంగు దుస్తులను వేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
తర్వాత శుభ్రమైన దుస్తులతో మందిరాన్ని శుభ్రం చేయాలి.

అలాగే శ్రీరాముడి ఫోటో లేదా విగ్రహాన్ని మందిరంలో ఉంచాలి.కుటుంబ సభ్యులు అందరూ ఉంటే ఎంతో మంచిది.అలాగే సంప్రదాయకంగా కుటుంబంలోని యువతులు కుటుంబంలోని అందరి నుదుటిపై తిలకాన్ని పెట్టడం మంచిది.
గంగాజలాం, కుంకుమ, గ్రంధాన్ని దేవతల పై చల్లడం మంచిది.ఆ తర్వాత రాముడు, లక్ష్మణుడు, సీతా, హనుమంతుని విగ్రహాలను పూజించాలి.
శ్రీరాముడి స్తోత్రాలను జపిస్తే ఆ ఇంటికి మంచి జరుగుతుంది అలాగే దేవునికి దండం పెట్టి హారతిని కూడా ఇవ్వాలి.కుటుంబ సభ్యులకు ప్రసాదం పంచాలి.
అంతేకాకుండా 9రోజుల చైత్ర నవరాత్రులలో చాలామంది భక్తులు శ్రీరామనవమి రోజు యజ్ఞం లేదా హోమం చేస్తారు.పవిత్రమైన రోజున భక్తులు శ్రీరాముడి తల్లి కౌసల్య( Kausalya ), తండ్రి దశరథ మహారాజును, భార్య సీతా, ముగ్గురు తమ్ముళ్లు భరతుడు, లక్ష్మణుడు, శతృఘ్నులను పూజిస్తారు.
శ్రీరాముడికి గొప్ప భక్తులైన హనుమంతుడికి నమస్కరిస్తే తప్ప పూజ పూర్తి కాదని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.