అప్పట్లో బాలయ్యకు మాత్రమే సాధ్యమైన.. మరే హీరో టచ్ చేయలేని రికార్డ్!

నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna )ఈ రోజు తన పుట్టిన రోజును జరుపు కుంటున్నారు.ఈ సందర్భంగా ఈయనకు నిన్నటి నుండే ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.

 This Record Was Possible Only For Balayya,  Balakrishna,  Anil Ravipudi,  Bhagav-TeluguStop.com

సోషల్ మీడియాలో ప్రముఖులు, ఫ్యాన్స్ విశేష్ తో సందడి మాములుగా లేదు.ఇదిలా ఉండగా ఈయన తన జనరేషన్ లో ఒక రికార్డ్ నెలకొల్పాడు.

ఆ రికార్డ్ మరే ఇతర హీరోలకు సాధ్యం కాలేదు.అలాంటి రికార్డ్ మరో హీరో నెలకొల్పతాడు అనే గ్యారెంటీ కూడా లేదు.

ఆ జనరేషన్ మాత్రమే కాదు.ఇప్పటి జనరేషన్ కు కూడా సాధ్యం కానీ రికార్డ్ నెలకొల్పాడు.

ఇంతకీ ఆ హీరో నెలకొల్పిన రికార్డ్ ఏంటి.అనే వివరాల్లోకి వెళ్తే.

బాలయ్య తన కెరీర్ లో డ్యూయెల్ రోల్ లో చాలా సినిమాల్లో నటించాడు.ఏకంగా 18 సినిమాల్లో డ్యూయెల్ రోల్ లో నటించాడు.

ఇలా ఇన్ని డ్యూయెల్ రోల్స్ చేసి బాలయ్య అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసాడు.ఈయన ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు చాలా వరకు బాగానే హిట్ అయ్యాయి.ఈ మధ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో కూడా బాలకృష్ణ డ్యూయెల్ రోల్( Dual role ) లో నటించాడు.మరి ఇప్పటి హీరోలు ఇలాంటి రికార్డ్ నెలకొల్పడం అంటే అసాధ్యం అనే చెప్పాలి.

బాలయ్య కవల సోదరుడిగా, తండ్రి తనయుడిగా, తాత మనవళ్లుగా, బావ బామ్మర్దులుగా, రాజుగా, సామాన్యుడిగా, భగవంతుడిగా, భక్తుడిగా పాత్రల్లో డ్యూయెల్ రోల్లో నటించి మెప్పించాడు.మొత్తానికి ఎవ్వరికి సాధ్యం కానీ రికార్డ్ అయితే ఈయన పేరు మీద ఉంది.ఇదిలా ఉండగా ప్రజెంట్ నందమూరి బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా నుండి బర్త్ డే కానుకగా టీజర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube