కరోనా విపత్కర పరిస్థితుల్లో సీసీసీ ద్వారా సినీ కార్మీకులకు అండగా ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.ఆయన ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ లాస్ట్ ఇయర్ సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ వారికి సీసీసీ నిత్యావసరాలు పంపిణీ చేసింది.ఇక ఇప్పుడు సీసీసీ ఆధ్వర్యంలో అందరికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చెశారు.
సినీ వర్కర్స్, మా సభ్యులు, ఫిల్మ్ జర్నలిస్టులకు వారి కుటుంబాలకు వ్యాక్సిన్ వేయించడానికి సీసీసీ ముందుకొచ్చింది.అపోలో హాస్పిటల్ వారి సహాకారంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
ఇప్పటికే సీసీసీ ద్వారా 45 ఏళ్లు పైబడిన వారికి మొదటి డోస్ వేయించారు.ఇక ఇప్పుడు 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది.
వ్యాక్సిన్ కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిరంజీవి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డైరక్టర్ ఎన్.శంకర్ పాల్గొన్నారు.

సీసీసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ వారి సహకారంతో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్టు చిరంజీవి వెల్లడించారు.సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్, ఫిలిం ఫెడరేషన్ సభ్యులు, మా ఆర్టిస్టులతో పాటుగా జర్నలిస్ట్ లకు వ్యాక్సిన్ అందిస్తున్నట్టు చెప్పారు.పేర్లు నమోదు చేసుకున్న వారిలో రోజుకి 500, 600 మందికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.సినీ కార్మీకులంతా తప్పకుండా వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పారు.