Tollywood Movies: టాలీవుడ్ ని లాక్ చేసిన నయా సెంటిమెంట్..ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా ?

తెలుగు సినిమాలు అంటే చాలు కేవలం మాస్ కమర్షియల్ సినిమాలు లేదంటే రొమాంటిక్ చిత్రాలు అనే పేరు ఎప్పటి నుంచో ముద్ర పడిపోయింది.ఈ మధ్య ఫ్యాన్ ఇండియా సినిమాలు పెరిగిన తర్వాత మన తెలుగు సినిమాలపై ఈ కంప్లైంట్ ఎక్కువగా వస్తుంది.

 Tollywood New Sentiment Genre Movies Bhagavanth Kesari Hi Nanan Saindhav-TeluguStop.com

మీరు ఇక జోనర్ మార్చరా ? ఎప్పుడు అదే మాసు లేదా అదే రొమాంటిక్ సినిమాలా అంటూ సెటైర్స్ వేసే వారు పెరిగిపోయారు.అది గమనించారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మన తెలుగు హీరోలు వరుస పెట్టి జోనర్ మార్చేసే పనిలో ఉన్నారు.

మరి టాలీవుడ్ హీరోలంతా జోనర్ మార్చేసి సెంటిమెంట్( Sentiment Genre ) అనే ఆయుధాన్ని పట్టుకొని తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.ఈ జోనర్ లో ప్రస్తుతం వస్తున్న సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నాన్న

నాచురల్ స్టార్ నాని( Nani ) దసరా సినిమా తర్వాత హాయ్ నాన్న( Hi Nanna ) అనే సినిమాతో మరోసారి టాలీవుడ్ పై దండయాత్ర చేయడానికి సిద్ధమైపోయారు.ఫాదర్ మరియు కూతురు సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో అంచనాలు బాగానే ఉన్నాయి.

ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతుంది.

Telugu Balakrishna, Nanna, Nani, Saindhav, Genre, Tollywood, Venkatesh-Movie

సైంధవ్

సెంటిమెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఏకైక తెలుగు హీరో వెంకటేష్.( Venkatesh ) ఆయన అనేక సినిమాల్లో కూతురు సెంటిమెంట్ అనే ఆయుధాన్ని పట్టుకొని తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నారు.ఇప్పుడు సైంధవ్ సినిమాలో( Saindhav ) కూడా కూతురు సెంటిమెంట్ ఉండబోతోంది.

ఈ సినిమా కూడా వెంకటేష్ కి బంపర్ విజయాన్ని కట్టబెడుతుందని అంతా భావిస్తున్నారు.ఈ సినిమా కూడా డిసెంబర్ లోనే హాయ్ నాన్నకు పోటీగా విడుదల అవుతుండటం విశేషం.

Telugu Balakrishna, Nanna, Nani, Saindhav, Genre, Tollywood, Venkatesh-Movie

భగవంత్ కేసరి

బాలకృష్ణ( Balakrishna ) అఖండ సినిమాలో చైల్డ్ యాక్టర్ సెంటిమెంట్ వాడి ఘనవిజయాన్ని సాధించారు.అదే ఫార్ములా మరోసారి భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) ద్వారా చూపించబోతున్నారు.ఈ సినిమాలో శ్రీ లీల బాలకృష్ణకి కూతురి పాత్రలో నటిస్తోంది.మరి తండ్రి కూతుర్ల మధ్య సెంటిమెంట్ సీన్స్ బలంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.ఈ చిత్రం మరో వారం రోజుల్లో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube