టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ( Hero Prabhas )నటిస్తున్న ది రాజాసాబ్( The Rajasab ) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.వాస్తవానికి సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం, ఇతర కారణాల వల్ల దసరాకు వాయిదా పడింది.
హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
అయితే దసరా పండుగకు ఇప్పటికే బాలయ్య అఖండ2 సినిమా ( Akhanda 2 movie )ఫిక్స్ అయిందనే సంగతి తెలిసిందే.ప్రభాస్, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఈ ఇద్దరు హీరోలలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాల్సి ఉంది.
ది రాజాసాబ్ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా అఖండ2 సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలుగా ఉందని సమాచారం అందుతుండటం గమనార్హం.

ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.ఈ సినిమాల డిజిటల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే సంచలనం అవుతుందని చెప్పవచ్చు.
ప్రభాస్, బాలయ్య ఈ సినిమాలతో కచ్చితంగా విజయాలను అందుకోగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ది రాజాసాబ్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.అఖండ సీక్వెల్ లో మాత్రం ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.
ది రాజాసాబ్, అఖండ2 సినిమాలలో ఏ సినిమా కలెక్షన్ల విషయంలో పైచేయి సాధిస్తుందో చూడాలి.ప్రభాస్, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు సైతం తక్కువగానే ఉన్నాయనే సంగతి తెలిసిందే.2004 సంవత్సరంలో ఈ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు.