చాలామంది ప్రజలు వారి జీవన విధానంలో వారికి తెలియకుండా ఎన్నో చిన్న చిన్న తప్పులను చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే మామూలుగా గురువారం రోజు చాలా మంది వారికి తెలియకుండానే తలస్నానం చేస్తూ ఉంటారు.
అయితే గురువారం రోజున తల స్నానం చేయడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.ఇలా చేయడం ఎందుకు మంచిది కాదు అంటే గురువారం బృహస్పతికి అంకితం చేయబడిన రోజు.
గురువారం రోజున లక్ష్మీ సమేత మహావిష్ణువుని పూజించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.
అయితే గురువారం రోజున ముఖ్యంగా మగవారు కొన్ని పనులు చేయడం వల్ల మహావిష్ణు ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది.
గురువారం రోజున మగవారు చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మామూలుగా మంగళవారం, శుక్రవారం లో గోర్లు కత్తిరించకూడదని మన పెద్దవారు చెబుతూ ఉంటారు.అయితే గురువారం రోజున కూడా మగవారు గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు.ఇలాంటి పనులు చేయడం వల్ల వారు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
అంతేకాకుండా గురువారం రోజున స్త్రీలు పురుషులు తలస్నానం కూడా చేయరాదు.ఇలా చేయడం వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి.ఇంకా చెప్పాలంటే గురువారం రోజున ఇంట్లో ఉన్న చెత్త పరవేయడం, పాత సామాన్లు అమ్మడం వంటి పనులు కూడా చేయడం మంచిది కాదు.ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు దూరమవుతాయి.
అంతేకాకుండా గురువారం రోజున ఎవరి దగ్గర అప్పు చేయడం అంత మంచిది కాదు.ఇలా అప్పు చేయడం, అప్పు ఇవ్వడం వల్ల గురువారం రోజున ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి మగవారు గురువారం రోజు ఇలాంటి పనులకు కాస్త దూరంగా ఉండటమే మంచిది.