ఆ హీరోయిన్ విషయంలో సీనియర్ ఎన్టీఆర్ జోస్యం నిజమైందా.. ఏమైందంటే?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన జయప్రద ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.సీనియర్ ఎన్టీఆర్ మహా నటుడు అని నటనకే నటన నేర్పిన మహా నాయకుడు అని జయప్రద కామెంట్లు చేశారు.

 Jayaprada Interesting Comments About Senior Ntr Goes Viral In Social Media Details, Jayaprada, Senior Ntr, Ntr Shata Jayanthi, Nandamuritaraka Rama Rao, Jayaprada About Ntr, Adavi Ramudu Movie-TeluguStop.com

నేను చాలా లక్కీ అని అనుకుంటున్నానని సీనియర్ ఎన్టీఆర్ గారిని మూడు తరాలుగా మూడు స్టేటస్ లలో చూశానని ఆమె తెలిపారు.

బాల్యంలో సీనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానినని సీనియర్ ఎన్టీఆర్ కు జోడీగా నటించడం వల్లే తనకు స్టార్ స్టేటస్ దక్కిందని ఆమె చెప్పుకొచ్చారు.

 Jayaprada Interesting Comments About Senior Ntr Goes Viral In Social Media Details, Jayaprada, Senior Ntr, Ntr Shata Jayanthi, Nandamuritaraka Rama Rao, Jayaprada About Ntr, Adavi Ramudu Movie-ఆ హీరోయిన్ విషయంలో సీనియర్ ఎన్టీఆర్ జోస్యం నిజమైందా.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత నాకు తెలియకుండానే ఆయన అడుగుజాడల్లో నడిచానని ఆమె అన్నారు.మూడు స్టేజ్ లలో సీనియర్ ఎన్టీఆర్ ను దగ్గరగా చూశానని అలా చూడటం తన లక్ అని ఆమె తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో సైతం రాజసంతో గొప్ప నాయకుడిగా నిలబడ్డారని జయప్రద అన్నారు.

ఆయన కారణజన్ముడని ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుందని జయప్రద చెప్పుకొచ్చారు.

బాల్యంలో తాను అన్నయ్య వెంట షూటింగ్ లకు వెళ్లేదానినని సీనియర్ ఎన్టీఆర్ మేకప్ వేసుకుంటుంటే తాను అలాగే చూస్తూ ఉండిపోయానని ఆమె కామెంట్లు చేశారు.దాసరి డైరెక్షన్ లో తెరకెక్కిన దేవుడే దిగివస్తే సినిమాకు సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా తాను షీల్డ్ అందుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

అవార్డ్ ఇచ్చే సమయంలో తాను పెద్ద హీరోయిన్ అవుతానని సీనియర్ ఎన్టీఆర్ అన్నారని ఆమె తెలిపారు.తర్వాత రోజుల్లో జయప్రద విషయంలో సీనియర్ ఎన్టీఆర్ జోస్యం నిజమైందనే సంగతి తెలిసిందే.అడవిరాముడు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కు జోడీగా నటించే అవకాశం దక్కిందని ఆ సమయంలో తాను ఎంతో సంతోషించానని ఆమె చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube