దేశంలో ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలని ప్రధాన మోదీ అన్నారు.కనీసం ఒక పీజీ వైద్య విద్యాసంస్థనైనా ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.రాజస్థాన్ లోని బన్ స్వారా, శిరోమణి, హన్ మాన్ గుడ్, దౌసాల్లో 4 మెడికల్ కాలేజీలకు గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.
జైపూర్ లోని సీతాపూర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం 170 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసిందని.
మరో వంద కళాశాల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఆరోగ్య సంరక్షణ లో రోగాల నివారణ పై ప్రత్యేక దృష్టి సారించామని ఆయుర్వేదం, యోగాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కొత్త జాతీయ విధానంతో దేశ ఆరోగ్య రంగంలోని లోపాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు.
ఒకప్పుడు దేశంలో ఆరు ఎయిమ్స్ ఉండగా.ఇప్పుడు వాటి సంఖ్య 22కు పెరగడం సంతృప్తిగా ఉందని అన్నారు.కోవిడ్-19 వైరస్ వందేళ్లలో సంభవించిన అతిపెద్ద మహమ్మారి అని ఆరోగ్య రంగానికి పాఠాలు నేర్పింది అని మోదీ అన్నారు.ఈ మహమ్మారి కారణంగా ఆరోగ్య రంగంలో స్వావలంబన సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ సంకల్పం తీసుకుందని చెప్పారు.