మహేష్ బాబు ,రాజమౌళి( Mahesh Babu, Rajamouli ) కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కిపోతున్న విషయం తెలిసిందే.గత రెండు వారాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) వీరిద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతోంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ని జనవరిలో స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్తికాగా ఇటీవలే రెండవ షెడ్యూల్ కోసం ఒడిశా వెళ్లారట మూవీ మేకర్స్.ఇలా తరచూ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

అందులో భాగంగానే ఇప్పుడు మరో వార్త వైరల్ గా మారింది.మరి ఆ వివరాల్లోకి వెళితే.ఇండియానా జోన్స్ తరహా ఈ మూవీలో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ ( Science fiction element )ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.
దీనికి కారణం సినిమా షూటింగ్ నుంచి లీకైన ఒకే ఒక్క క్లిప్.ఈ సినిమాలో విలన్ పాత్రధారి పృధ్వీరాజ్ సుకుమార్ ఒక కుర్చీలో కూర్చుంటాడు.
అతడి ఎదురుగా మహేష్ నిల్చుంటాడు.

ఆర్మీ దుస్తుల్లో ఉన్న వ్యక్తి వచ్చి మహేష్ ను ముందుకు తోస్తే, విలన్ ముందు మోకాళ్లపై కూర్చుంటాడు మహేష్.సరిగ్గా ఇక్కడే విలన్ కూర్చున్న కుర్చీ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది.సరిగ్గా ఎక్స్ మెన్ సిరీస్ సినిమాలో ఒక వ్యక్తి ఇదే కుర్చీలో కనిపిస్తాడు.
ఆ సినిమాలో మాత్రమే కాదు, మరికొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కూడా ఇదే తరహా కుర్చీ కనిపిస్తుందట.అలాంటి కుర్చీని విలన్ కోసం వాడాడంటే, కచ్చితంగా మహేష్ సినిమాలో కూడా సైన్స్ ఫిక్షన్ టచ్ కాస్త ఉన్నట్టుందనేది నెటిజన్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాకు కొబ్బరికాయ కొట్టిన విషయమే రాజమౌళి బయటకు చెప్పలేదు.ఇలాంటి కీలకమైన విషయాన్ని అతడు బయటపెడతాడనుకోవడం అత్యాశే అవుతుందని చెప్పాలి.రాజమౌళి సినిమాను రూపొందించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు.చిన్న విషయం కూడా లీక్ అవ్వకుండా ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సినిమా మొత్తం పూర్తయ్యాక వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్లను ఇస్తూ ఉంటారు.







