టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha )అలాగే స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.దాదాపు నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న సమంత నాగచైతన్యలు ఊహించని విధంగా విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారం అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.రెండు మూడు వారాలపాటు ఎక్కడ చూసినా కూడా ఇదే అంశం గురించి వార్తలు చర్చలు కొనసాగాయి.
ఇక నాగచైతన్య సమంత విడాకుల తర్వాత వాళ్ళు మళ్ళీ కలుస్తారని అందరూ భావించారు.

కానీ అది ఎప్పటికీ జరగదు అని తెలిసిపోయింది.ఇటీవల నాగచైతన్య రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇకపోతే వీళ్ళిద్దరూ విడిపోయిన తరువాత అక్కినేని కుటుంబానికి అలాగే నాగచైతన్యకు సంబంధించిన చాలా వస్తువులను బహుమతులను సమంత వెనక్కు పంపించింది అంటూ అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి.
వాటిలో కొన్నింటిని మాత్రమే ఆమె దగ్గర ఉన్నాయి అంటూ కూడా వార్తలు వినిపించాయి.అందులో ఒకటి నిశ్చితార్థం ఉంగరం.సమంతతో నిశ్చితార్థం జరిగినప్పుడు ఆమె వేలికి ఖరీదైన డైమండ్ రింగ్ తొడిగాడు చైతూ.3 క్యారెట్ల ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్( 3 carat princess cut diamond ring ) ను చాలా సందర్భాల్లో సమంత బయటపెట్టింది.

మరి ఇప్పుడా ఎంగేజ్ మెంట్ రింగ్ ఏమైంది? విడాకుల తర్వాత చేతికున్న ఆ వజ్రపు ఉంగరాన్ని తీసేసింది సమంత.అలా తీసేసిన ఉంగరాన్ని అందమైన పెండెంట్ గా మార్చుకున్నట్టు తెలుస్తోంది.ఆ పెండెంట్ ను బంగారు చైన్ ( Pendant and gold chain )కు తగిలించి అప్పుడప్పుడు మెడలో ధరిస్తుంటుందట.అయితే సామ్ ఇలా వస్తువుల్ని మార్చి వాడుకోవడం సమంతకు ఇదే తొలిసారి కాదు.
తన తెల్లటి వెడ్డింగ్ గౌన్ ను ఆమె నల్లటి బాడీకాన్ డ్రెస్ గా మార్చేసింది.అప్పట్లో సోషల్ మీడియా దీనికి రివెంజ్ డ్రెస్ అనే ట్యాగ్ కూడా ఇచ్చింది.
అయితే ఇలా ఎన్ని గుర్తులు మారుస్తున్నప్పటికీ, తన ఒంటిపై ఉన్న పచ్చబొట్టును మాత్రం ఆమె తొలిగించుకోలేకపోతోంది.మరీ ముఖ్యంగా రొమ్ముకు కాస్త కింద భాగంలో, నడుముకు పైన వేయించుకున్న నాగచైతన్య పచ్చబొట్టు ఇంకా అలానే ఉంది.







