ప్రస్తుతం సమ్మర్ సీజన్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే.సమ్మర్ అంటే సెలవులు సమయం.
ఈ టైంలో ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు.ముఖ్యంగా బీచ్ లు, రిసార్ట్ లు అంటూ ఫుల్లుగా వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటారు.
ఈ క్రమంలో స్కిన్ అనేది టాన్ అవ్వడం సర్వ సాధారణం.అయితే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి చాలా మంది బ్యూటీ పార్లర్ లో వేలకు వేలు ఖర్చుపెట్టి డీ-టాన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు.
కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే టాన్ ను సులభంగా తొలగించే టాప్ అండ్ బెస్ట్ హోమ్ రెమెడీస్ కొన్ని ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెమెడీ – 1:
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ షుగర్, వన్ టేబుల్ స్పూన్ హనీ ( Honey )వేసుకొని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని పది నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో క్లీన్ చేయాలి.
రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే టాన్ మొత్తం తొలగిపోతుంది.స్కిన్ గ్లోయింగ్ గా షైనీగా మెరుస్తుంది.

రెమెడీ – 2 :
ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మరియు సరిపడా పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.ఈ రెమెడీ కూడా టాన్ ను తొలగిస్తుంది.చర్మాన్ని అందంగా కాంతివంతంగా మెరిపిస్తుంది.

రెమెడీ – 3:
ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బంగాళదుంప తురుము, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసిన కూడా స్కిన్ డీ-టాన్ అవుతుంది.చర్మం పై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.